“నా మంచం మీద ఎప్పుడు ముగ్గురు మగాళ్లు..” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి కస్తూరి !

0
224

టాలీవుడ్ మూవీ ‘అన్నమయ్య’ గుర్తుందా మీకు.? ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కస్తూరి గుర్తుందా.? ఇప్పుడామె టాపిక్ ఎందుకంటారా.? లేటెస్ట్ గా ఓ బుల్లితెర షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ‘ఆలీతో సరదాగా’ అనే బుల్లితెర షోలో దర్శనమిచ్చింది హీరోయిన్ కస్తూరి. ఈ షోలో భాగంగా తన సినిమా కెరీర్, ఫ్యామిలీ విషయాలు, తన ఇష్టాలు, కష్టాలు అన్నీ ఆ ప్రోగ్రామ్ లో ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. టాలీవుడ్ కింగ్, హీరో నాగార్జునను చూసి తాను ప్రేమలో పడిపోయానని తెలియజేసింది అలనాటి హీరోయిన్ కస్తూరి.

టాలీవుడ్‌ మన్మథుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అక్కినేని నాగార్జునకు.. వయసు పెరిగినా సరే, అందం ఏ మాత్రం తగ్గడం లేదు. కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌ పక్కన నిలబడితే నాగ్ అచ్చం వాళ్ళ బ్రదర్‌లా కనిపిస్తాడే తప్ప, ఫాదర్‌ లా అస్సలు కనిపించడు. 60 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న నాగ్ ఇప్పుడే ఇంత అందంగా ఉంటే.. 20, 30 ఏజ్‌లో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అలాంటి హ్యాండ్సమ్ ను తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎంతో మంది హీరోలతో కలిసి పని చేసిన కస్తూరి.. చూడగానే ప్రేమలో పడిపోయానని చెప్పేసి ప్రేక్షకులందరికీ షాకిచ్చింది. ‘అన్నమయ్య, ఆకాశ వీధిలో’’ సినిమాల్లో నాగార్జనతో కలిసి నటించిన ఈ సీనియర్ హీరోయిన్.. ‘అన్నమయ్య’ చిత్రం షూటింగ్ స్పాట్ లో నాగ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన రోజు, ఆ చేయిని ఎవరినీ ముట్టుకొనివ్వలేదని.. చేయి కూడా కడగకుండానే అలాగే పడుకున్నానని చెప్పింది. అలాగే ఈ షోలో “లైఫ్ లో ముగ్గురు మగాళ్లకు నిద్రపోతున్నపుడు ఫోన్ చేస్తారా.?” అని అలీ ఓ ప్రశ్న అడుగుతుండగా మధ్యలోనే కలుగ జేసుకొని.. “నా మంచం మీద ఎప్పుడు ముగ్గురు మగాళ్లు..” అంటూ కస్తూరి ఈ విషయాన్ని ఇలా కూడా చెప్పవచ్చని షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఆలీ స్టన్నయ్యాడు.

ఇక ఆ స్టోరీ ఏమిటనేది ‘ఆలీతో సరదాగా’ ఫుల్ షో చూస్తే మీకే అర్ధమౌతుంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నాగార్జున ఫ్యాన్స్ ఈ వీడియోను ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా వుండగా ప్రస్తుతం మన సీనియర్ నటి కస్తూరి బుల్లితెర సీరియల్స్‌‌ తో బిజీగా ఉండగా.. తను నటిస్తున్న ‘గృహలక్ష్మి’ సీరియల్ ప్రేక్షకాదరణ పొందింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది కస్తూరి. ఆ తర్వాత అసలు వెండి తెర మీదనే కనిపించకపోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here