ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసి, భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాయి జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలు. వివరాల్లోకి వెళితే.. పుల్వామా జిల్లా, త్రాల్ సమీపంలో ఉన్న ఒక పండ్ల తోటలో సుమారు ఐదు కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

పేలుడు పదార్థాల నిల్వ కూడా సంబంధించిన పక్కా సమాచారం అందటంతో జమ్మూ పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలుతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, ఐదు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు.



























