Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో మాత్రం తన స్టైల్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా సుడిగాలి సుదీర్ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈయనకు కూడా సినిమా అవకాశాలు రావడంతో సుడిగాలి సుదీర్ సైతం ఈ కార్యక్రమాల నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుధీర్ చేయకపోయినా సుదీర్ పై పంచులు వేస్తూ తరచూ సుడిగాలి సుదీర్ లో గుర్తు చేసుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సుధీర్ పట్ల పంచు డైలాగులు వేయడమే కాకుండా సుదీర్ స్థానాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాలి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆదికి ఒక ప్రశ్న ఎదురయింది.సుధీర్ తిరిగి మల్లె మాల వారి కార్యక్రమాలలోకి వస్తే ఆయన ప్లేస్ తిరిగి ఆయనకు ఇస్తారా అంటూ యాంకర్ ప్రశ్నించారు.

Hyper Aadi: మేం లేకపోతే సుదీర్ ఫేమస్ కారు…
ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ కేవలం సుధీర్ అనే వ్యక్తి వల్ల మల్లెమాలవారికి పేరు రాలేదు. మేమందరం సుధీర్ వెంట ఉంటూ ఆయనపై పంచ్ డైలాగులు వేయటం వల్ల సుదీర్ ఫేమస్ అయ్యారు. మేము లేకపోతే సుదీర్ అంత ఫేమస్ అయ్యే వారు కాదని హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో సుడిగాలి సుదీర్ అభిమానులు మాత్రం హైపర్ ఆది పై కాస్త గుర్రుగా ఉన్నారు.





























