Hyper Adhi & Varshini : ఈటీవీలో జబర్దస్త్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుని వన్ అఫ్ ది బెస్ట్ కమెడియన్ గా ఉన్న హైపర్ ఆది తన పంచులకు ఫేమస్. ఆది లేని జబర్దస్త్ స్కిట్ చప్పగానే ఉంటుంది మరి. ఇక ఓ వైపు జబర్దస్త్ స్కిట్లు చేస్తూనే మరో వైపు సినిమాల్లోను మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న ఆది ప్రస్తుతం జబర్దస్త్ లో కనిపించడం లేదు.కారణాలేవైనా ప్రస్తుతం ఆది, సుధీర్, శీను వంటి స్టార్ కమెడియన్స్ లేని లోటు జబర్దస్త్ లో కనిపిస్తోంది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఆది జబర్దస్త్ తరువాత ఢీ షో లో బాగా ఫేమస్. సుధీర్, రష్మీ ల జంట బుల్లితెరపై బాగా ఫేమస్ నిజానికి వీరి మధ్య ఏమైనా ఉందొ లేదో కానీ తెర పై మాత్రం కెమిస్ట్రీ అదిరిపోతుంది.

ఆది నువ్వు నా సపోర్ట్ సిస్టం రా…..

ఇక ఈటీవీ వారు ఇలాంటి మరో జంటను తయారు చేయాలని అనుకున్నారు కాబోలు అందుకే సుధీర్ రష్మీ లాగా ఆది , వర్షిణి జంటను స్క్రీన్ మీద పెట్టారు. ఢీ షోలో వీరిద్దరితో రొమాంటిక్ డాన్సులు వేయించి ఏదో ఉంది అనుకునేలా చేసారు అయిన ఇదంతా గత సీజన్ ముచ్చట ఇపుడు వర్షిణి పోయి నవ్య స్వామి, రవికృష్ణ వచ్చారనుకోండి. ఇక స్క్రీన్ పై వర్షిణి, ఆది జంటను అందరూ మర్చిపోయారు కూడా. వర్షిణి తమిళ అమ్మాయి అయిన కూడా తెలుగు తెర పై బాగానే క్లిక్ అయింది. అటు పెళ్లి గోల వంటి వెబ్ సిరీస్ లతో హిట్లు కొడుతూనే ఇటు టీవీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తోంది. అపుడపుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ చిన్నది ఇపుడు మరోసారి ఆదితో కనిపించి వైరల్ అయింది. నిజానికి ఆది, వర్షిణి ల మధ్య స్నేహం ఉండొచ్చు కానీ ప్రైవేట్ గా ఆది వర్షిణి తో తన పుట్టినరోజుని జరుపుకునేంత అని ఎవరు ఊహించలేదు.
ఇక వర్షిణి పుట్టినరోజుకి విష్ చేస్తూ హాగ్ చేసుకుని డియర్ ఆది.. హ్యాపీ బర్త్ డే. నా జీవితం మొత్తం నీవు తోడుగా ఉండాలి. నా ఫేవరేట్ పర్సన్, నా 3 ఏఏమ్ ఫ్రెండ్ సపోర్ట్ సిస్టం నువ్వే. రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది అంటూ లవ్ ఎమోజిలతో పోస్ట్ చేసింది. ఇక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే చాలా మంది నెటిజన్స్ వీరి మధ్య ఏదో ఉంది అంటూ మొదలెట్టేసారు. కొంత మంది అయితే జంట బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు వీరి మధ్య ఏముందో వాళ్ళే చెబితే కానీ క్లారిటీ రాదు.



























