Hyper Adi: ఈటీవీ మల్లెమాల నుండి వస్తోన్న కొత్త ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ వినోదాత్మకంగా సాగుతూ టీఆర్పి లో బాగా దూసుకుపోతుంది. జబర్దస్త్ కంటే ఈ మధ్య శ్రేదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికే ఎక్కువ క్రేజ్ వస్తోంది. సుధీర్ యాంకర్ గా వస్తోన్న ఈ షోకి జడ్జిగా ఇంద్రజ గారు వ్యవహరిస్తూ షోకి కొత్త అందం తెచ్చారు. ప్రతి ఎపిసోడ్ లోను ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చే ఈ షోలో ఈ వారం హైపర్ ఆది చేసిన రచ్చ మాములుగా లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ను యూట్యూబ్ లో విడుదల చేసారు. ఆద్యంతం నవ్వులతో సాగిన ఈ ప్రోమో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక హైపర్ ఆది శోభనం కోసం ఎదురుచూస్తున్న పెళ్ళికొడుకుగా నవ్వులు పూయించాడు. ఇక భానుతో కలిసి డాన్స్ ఇరగదీసాడు. నలుగురు చెల్లెళ్లకు పెళ్లి చేశాకే ఆది శోభనం అంటూ సాగిన కాన్సెప్ట్ తో నవ్వులు పంచారు. ఇక మధ్యలో ఆది పంచె తీసి నెత్తిమీద వేసి మరీ ఆదిని ఏడిపించారు. ఇక నవ్వలేక ఇంద్రజ తాను కూర్చున్న చైర్ లోంచి లేచి పక్కుకు వెళ్ళిపోయి మరీ నవ్వారు.
ఇక యష్ మాస్టర్ చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటూ డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు . ఇక చివర్లో ఆది భాను కలిసి తెల్ల తెల్లని చీర అంటూ డాన్స్ చేసి ఫైర్ పుట్టించారు. చెల్లెళ్లుగా కావ్య, వర్ష, విష్ణు వేసిన పంచులు బాగా పేలాయి. ఇక ఆది ఈమధ్య జబర్దస్త్ లో కనిపించడం లేదు ఇక ఈ విషయాన్ని కూడా శ్రీ దేవి డ్రామా కంపెనీ వాళ్ళు వదల్లేదు. శోభనం కావాలంటే జబర్దస్త్ కి మళ్ళీ రావాలంటూ పంచులేసారు. ఈ ప్రోమో ఎపుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.



































