హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన అక్సా ఖాన్.. లిమిట్స్ లో ఉండాలంటూ..!

0
162

బుల్లితెరపై ఎన్ని డ్యాన్స్ షోలు ప్రసారమతువున్నా ఈటీవీ ఛానెల్ లో ప్రసారమెయ్యే ఢీ డ్యాన్స్ షో ప్రత్యేకమనే చెప్పాలి. చాలా సంవత్సరాల నుంచి దేశంలోని డ్యాన్సర్లతో కొత్త తరహా డ్యాన్సులు చేయిస్తూ ఈ షో ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న డీ ఛాంపియన్స్ షోలో రష్మి, సుధీర్ ఒక టీంగా కొందరు డ్యాన్సర్లతో హైపర్ ఆది, వర్షిణి మరో టీంగా మరి కొందరు ‘డ్యాన్సర్లతో ఉన్నారు.

డీ ఛాంపియన్స్ షో సెమీఫైనల్స్ ప్రస్తుతం ప్రసారమవుతుండగా హైపర్ ఆదికి అక్సా ఖాన్ వార్నింగ్ ఇచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ షోలో అక్సాఖాన్, పండు ఇప్పటికే ఎలిమినేట్ కాగా పండు ఎలిమినేట్ కావడం ఢీ షో ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. పండు డ్యాన్సర్ గా అందరికీ సుపరిచితమైనా నాదీ నక్కిలీసు గొలుసు పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు.

అలాంటి కంటెస్టెంట్ పండు ఎలిమినేట్ కావడం వెనుక ఏదో జరిగిందని పండు ఫ్యాన్స్ తో పాటు కొందరు నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సెమీఫైనల్ లో రాజు ఎలిమినేట్ కాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజుకు ఎలిమినేట్ అయిన అక్సా ఖాన్ కూడా మద్దతు ఇస్తోంది. సుడిగాలి సుధీర్ తో పాటు అతని ఫ్యాన్స్ కూడా రాజుకు మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది.

రాజు వేరే టీం అయినప్పటికీ అతనికి మాత్రమే ఢీ ఛాంపియన్స్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని.. రాజు విషయంలో హైపర్ ఆది జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని అక్సా ఖాన్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అక్సా ఖాన్ అలా చెప్పడంతో ఆది కూడా సైలెంట్ గా ఉన్నారని సమాచారం. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here