Hero Sumanth: సుమంత్ .. నాగేశ్వర్ రావు మనవడిగా.. అక్కినేని బ్రాండ్ ఇమేజ్ తో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. తన ఎంట్రీ గ్రాండ్ గానే ఉన్నా.. ప్రస్తుతం అనుకున్నంతగా కెరీర్లో సక్సెస్ కాలేదు. స్టార్ హీరోగా ఎదగాల్సిన సుమంత్ ఆస్థాయికి చేరుకోకపోయాడు.

ప్రేమకథతో ఎంట్రీ ఇచ్చినా.. యువకుడు సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత గౌరీ సినిమా హిట్ అయినా.. అక్కడ నుంచి పెద్దగా కెరీర్ సాగలేదనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే సుమంత్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుమంత్, జగన్ మంచి స్నేహితులని అందరికీ తెలుసు.

అయితే చిన్నప్పటి నుంచి జగన్ నేను క్లాస్ మెట్స్, మంచి ఫ్రెండ్స్ అని అన్నారు. అయితే చిన్నప్పటి నుంచి జగన్ ని చూస్తున్నానని.. ఏదో రోజు రాజకీయాల్లో ఎదిగిపోతాడని ఊహించానని.. చివరకు తాను ఊహించినట్లే జగన్ ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారని అన్నాడు. చిన్నప్పుడు నాతో ఎలా ఉండేవాడో.. ఇప్పడు కూడా జగన్ నాతో అలాగే ఉంటాడని అన్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ కూడా..
తాజాగా సుమంత్ ‘ మళ్లీ మొదలైంది’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు కూాడా సిద్ధమైంది. ఈసినిమాలో సుమంత్ కు జోడీగా నయనా గంగూలీ, వర్ష సౌందర్ రాజన్ నటిస్తున్నారు. భార్యతో విడాకులు తీసుకునే సమయంలో తన కేసు వాదిస్తున్న లాయర్ తో ప్రేమలో పడే వ్యక్తిగా సుమంత్ ఈసినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. సినిమాలో పెళ్లి కార్డుని సోషల్ మీడియాలో లీక్ చేయడంతో సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తెగ ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ఉత్తిదే అని సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేశారని తెలిసింది. ‘మళ్లీ మొదలైంది’ చిత్రానికి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా… ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జీ5లో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది.





























