Battala Satyam:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మల్లిఖార్జున అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆ బట్టల సత్యం అంటే ఆయనను ఇట్టే గుర్తు పడతారు.లేడీస్ టైలర్ చిత్రం ద్వారా బట్టల సత్యం పాత్రలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మల్లికార్జునరావు అప్పటి నుంచి ఆయనకు అదే పేరు నిలిచిపోయింది.

తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తన నటన ద్వారా అందరినీ నవ్వించిన బట్టల సత్యం 2008 అతి భయంకరమైన క్యాన్సర్ తో మృతి చెందారు.సుమారు 373 చిత్రాలలో నటించి ఎంతోమందిని ఆకట్టుకున్న బట్టల సత్యం క్యాన్సర్ తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన మూడు రోజులకే మరణించారు.అప్పటివరకు ఆయన ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధితో బాధ పడుతున్నారని తన కుటుంబానికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదు.

1951 డిసెంబర్ 13 అనకాపల్లి లో జన్మించిన మల్లికార్జున నాకు చదువు పెద్దగా శ్రద్ధ లేకపోవటం వల్ల ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల వేయాలని ఆసక్తి ఉండడంతో మొట్టమొదటిసారిగా సితార సినిమాలో ఒక పాత్ర చేసిన తర్వాత నటుడిగా కొనసాగాలని ఆసక్తి కలిగింది.ఆ తర్వాత రెండు సంవత్సరాలకి లేడీస్ టైలర్ చిత్రంలోని బట్టల సత్యం పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
నమ్మిన వాళ్లు నాకు వేషాలు ఇస్తారు…
ఇండస్ట్రీలో ఆయన క్యాన్సర్ తో మరణించారనే వార్త తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అదే విధంగా తెరపై ఎంతో సరదాగా ఉంటూ అందరినీ నవ్వించే బట్టలు సత్యం నిజ జీవితంలో చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. ఆయన అద్భుతమైన నటనకు ఆయన కనుక నోరు తెరిచి అరిస్తే అతనికి ఎన్నో అవకాశాలు వచ్చేవి. కానీ తాను ఎవరినీ అవకాశాల కోసం అడగని నన్ను నేను అమ్ముకోవడానికి ఇండస్ట్రీకి రాలేదని తెలిపారు. నాలో విషయం ఉందని నమ్మిన వాళ్లు నాకు వేషాలు ఇస్తారని వారు. ఇలా అయిన 2008 జూన్ 24వ తేదీ బ్లడ్ క్యాన్సర్ తో మరణించారు.





























