రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం తడగొండలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కావేరి అనే భార్య తన భర్త హరీష్‌ను “నువ్వు నాకు నచ్చలేదు, చచ్చిపో” అని తీవ్రంగా దూషించడంతో మనస్తాపం చెందిన హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే… హరీష్, కావేరి 2014లో వివాహం చేసుకున్నారు. వారి కాపురం సజావుగానే సాగుతోంది. అయితే, పేదరికం కారణంగా పొట్టకూటి కోసం హరీష్ మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. భర్త దూరంగా ఉండటంతో కావేరి రక్షణ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం హరీష్‌కు తెలియడంతో వెంటనే దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు.
భార్యను నిలదీయగా, ఆమె రక్షణ్‌తోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో హరీష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తడగొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటన వివాహ బంధాల పవిత్రతను, నమ్మకాన్ని ప్రశ్నించే విధంగా ఉంది. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోలేక, ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం.
నువ్వు నాకు నచ్చలేదు చచ్చిపో.. భార్య మాటలకు
— BIG TV Breaking News (@bigtvtelugu) June 11, 2025
ఆత్మహత్య చేసుకున్న భర్త
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో ఘటన
2014లో కావేరితో హరీష్ వివాహం
పొట్టకూటి కోసం మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన హరీష్(36)
భర్త లేని సమయంలో రక్షణ్ అనే వ్యక్తితో కావేరి వివాహేతర సంబంధం
విషయం… pic.twitter.com/K5a3a6tcVZ

































