తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న శ్వేత మహంతి స్థానంలో ఎల్. శర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. ఇక నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న మను చౌదరికి పూర్తి స్థాయి కలెక్టర్‌గా నియమించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాధ్యతలను మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్‌కు అదనంగా అప్పగించారు.
ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న శ్వేతా మహంతి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకునేందుకు ప్రభుత్వాన్ని రిలీవ్ కోరగా… ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌కు నూతన కలెక్టర్‌గా ఎల్. శర్మన్‌ను నియమించింది. ప్రస్తుతం శర్మన్ నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా ఉన్నారు. ఇప్పడు హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…