కొద్ది రోజుల పాటు వరుసగా నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా ?? ఇంట్రెస్టింగ్ టాపిక్…

0
421

మన శరీరానికి నిద్ర చాలా అవసరం… నిద్రపోవడం వలన శరీరం రీఛార్జ్ అవుతుంది. తద్వారా మనకు మళ్ళీ తిరిగి పనిచేసే శక్తినిస్తుంది. శరీరం తన లోపల తానే లోపాలకు మరమత్తులు చేసుకుంటుంది. మరెన్నో పనులు మనం నిద్రపోవడం వలన జరుగుతూ ఉంటాయి. నిద్ర మనకు ఎంత అవసరమో.. ఇవన్నీ మనకి తెలిసినవే… కానీ కొద్దిరోజుల పాటు నిరంతరాయంగా అసలు నిద్రపోకుండా ఉంటే ఏమి జరుగుతుంది ? అసలు అలా ఉండగలమా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా??

నిజమే మనిషికి నిద్ర ఖచ్చితంగా అవసరమే… ఒక రకంగా చెప్పాలంటే మన ఆరోగ్యం మన నిద్రమీదే ఆధారపడి ఉంటుంది. అటువంటిది నిద్రపోకుండా ఎవరైనా కేవలం 3 రోజులు మాత్రమే ఉండగలరు. అంతకు మించి కాసేపు కూడా నిద్రపోకుండా ఉండలేరు.. ఏదో ఒక సమయంలో పగలైనా… రాత్రైనా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఎందుకంటే మూడు రోజులపాటు నిద్రలేకపోతే శరీరం బాగా అలసిపోతుంది. అటువంటి సమయంలో ఖచ్చితంగా మన శరీరం విశ్రాంతి కోరుతుంది. మరి వరుసగా కొన్ని రోజులపాటు నిద్రపోకుండా ఉండగలమా? అంటే ఖచ్చితంగా ఉండలేము… ఎవరు ఉండలేరు.. అయితే ర్యాండి గార్నర్ అనే వ్యక్తి నిరంతరాయంగా 11 రోజులపాటు నిద్రపోకుండా ఉన్నాడు. అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. అంతకుమించి ఎక్కువరోజులు ఎవరు ఉండలేరు… ఒక వేళ ప్రత్నించినా ఎదో ఒక సమయంలో ఖచ్చితంగా నిద్రపోతారు… లేకపోతే మృత్యువు బారిన పడతారు. ఇది డాక్టర్లు చెబుతున్న సత్యం.

సైంటిస్ట్ లు కొందరు మనుషులపై ప్రయోగాలను చేసారు. ఈ పరిశోధనలో తేలిందేమిటంటే ఇలా వరుసగా కొద్ది రోజులపాటు నిద్రపోని వారు నిద్రపోనివారికి కలలు వస్తాయట. అంటే… వారు పగలైనా.. ఏదైనా పని చేస్తున్నా సరే నిద్రపోయినట్టు కలలు కంటారట. ఏది ఏమైనా ఈ విషయం మంచి ఉంది కదా… బహుశా పగటి కలలు అంటే ఇదేనేమో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here