ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ₹15,000 విడుదల చేస్తోంది. ఇందులో ₹13,000 నేరుగా తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాకు జమవుతుంది, మిగతా ₹2,000 పాఠశాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ నిధులను విడుదల చేసింది, చాలామంది ఖాతాలకు డబ్బులు చేరాయి కూడా! కొంతమందికి ఇంకా రాయితీ డబ్బులు రాకపోతే ఇక్కడి స్టెప్స్ ఫాలో అయితే సులభంగా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి?
అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP కి వెళ్లండి.
“స్కీం” ఎంపికలో “తల్లికి వందనం” పథకాన్ని ఎంచుకోండి.
సంవత్సరంగా “2025-26” సెలెక్ట్ చేసి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
క్యాప్చా కోడ్ నింపి “గెట్ ఓటీపీ” బటన్ పై క్లిక్ చేయండి.
మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఇప్పుడు మీ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ స్క్రీన్‌లో కనిపిస్తుంది!
వాట్సాప్ ద్వారా కూడా తనిఖీ చేయొచ్చు!
AP మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ని ఉపయోగించి కూడా మీ పేమెంట్ డిటైల్స్ తెలుసుకోవచ్చు.
మీ ఖాతాకు డబ్బులు చేరకపోతే, బ్యాంక్ లేదా ఎస్సీఎస్ సెంటర్‌లో కూడా ఇన్‌క్వయిరీ చేయొచ్చు.

































