మీ దగ్గర 20 పైసలు, 25 పైసలు నాణేలున్నాయా.? అయితే మీరు లక్షాధికారి అయ్యే ఛాన్సుంది. అవును మీరు చదివింది అక్షరాల నిజమే. ఎలా అనుకుంటున్నారా? అయితే అసలు విషయం ఏమిటో ఇప్పుడే చదవి తెలుసుకోండి. OLX వంటి ఈ-కామర్స్ సంస్థలు ఈమధ్య పురాతన నాణేలను కళ్లు చెదిరే రేటుకు అమ్ముతున్నాయి. ఈ నాణేలు ఇప్పుడు అందుబాటులో కూడా లేవు. అయినా సరే వీటి ధరను మీరు తెలుసుకుంటే మీకు దిమ్మ తిరిగి రూపాయి బొమ్మ కనబడుతుంది. ఈమధ్య కాలంలో కొన్ని ఆన్‌లైన్ వెబ్ సైట్లు పాత నాణేలను భారీ ధరకు అమ్ముతున్నాయి.

OLX లో పాత 20 పైసలు నాణేలకు రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. 1986 నుంచి 1989 వరకు వున్న 20 పైసలు నాణేల ధర ఏకంగా రూ.2 లక్షలు పలుకుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన ట్విస్ట్ ఏమిటంటే.. ఈ పురాతన నాణేల ధర రూ.1,000 నుంచి ప్రారంభమౌతోంది. ఆన్ లైన్ లో వీటిని అమ్మే వ్యాపారస్తులు తమకు నచ్చిన రేటుకు ఈ పాత నాణేలను అమ్ముతున్నారు.

అలాగే 25 పైసలు నాణెం ధర కూడా రూ.1,000 నుంచే ఆరంభమౌతోంది. వీటి ధర కూడా వేలల్లోనే నడుస్తోంది. అదృష్టం బాగుంటే.. ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా రూ.లక్ష వరకు పలుకుతోంది. 1973 నుంచి 1975 వరకు, 1988 నుంచి 1990 వరకు చెలామణిలో వున్న పాత నాణేల ధర ఏకంగా రూ.లక్ష వరకు ఉంది. కాబట్టి మీ దగ్గర కూడా ఇలాంటి పురాతన నాణేలుంటే వెంటనే వాటిని ఆన్‌లైన్ లో విక్రయించి కళ్లు చెదిరే లాభం పొందండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here