“దేవదాస్” చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఇలియానా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపునే సంపాదించిందని చెప్పవచ్చు. ఆమె అందానికి దాసోహం అంటూ బాలీవుడ్ సినీ దర్శకులు కూడా ఆమెకు ఆఫర్లు ఇవ్వడంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఇలియానాకు అవకాశాలు తగ్గాయి.

అయితే హిందీలో కొన్ని హిట్ చిత్రాల్లో నటించిన ఇలియానా ఆ తర్వాత ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ మొదలు పెట్టింది. వీళ్ళిద్దరికీ ఈమధ్యనే పెళ్లైంది. కానీ., ఆ విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రైవసీ అన్నదే లేకుండా పోయింది. పబ్లిసిటీ మాయలో పడి హద్దులను కూడా చెరిపేశారు. ఎవరిని ఏం అడగాలో.. ఏం అడక్కూడదో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. తమకు తోచిందేదో అడిగేస్తున్నారు. ఫలితంగా అది పెద్ద సంచలనానికి దారి తీస్తోంది. ఇలాంటి సంఘటనే మన గోవా బ్యూటీ ఇలియానాకు ఎదురైంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ అవకాశాల్లేక ఖాళీగా ఉంటున్న ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా వుంటూ నెటిజన్లకు అందుబాటులో వుంటోంది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో “ఆస్క్ మీ ఎనీథింగ్” అంటూ తన ఫాలోవర్స్ తో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ ఛాటింగే ఇలియానాను ఇబ్బందుల్లో పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో ఇలియానాతో ఛాటింగ్ చేసిన ఓ నెటిజన్ ఇలియానాకు దిమ్మ తిరిగేలా ఆమె కన్యత్వం గురించి ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు? అంటూ అడగడంతో ఒక్కసారిగా షాకైన గోవా బ్యూటీ ఆ తర్వాత షాక్ నుండి తేరుకుని నువ్వడిగిన కన్యత్వం విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో అంటూ ఆ ఫాలోవర్ కి దిమ్మదిరిగే స్ట్రోక్ ఇచ్చిందని సమాచారం ఇలియానా



























