Imandhi Ramarao : ఇటీవలే మరణించిన సీనియర్ నటుడు కృష్ణం రాజు గారు తన నట జీవితంలో మైలు రాయి లాంటి సినిమాలు భక్త కన్నప్ప, అలాగే కృష్ణ వేణి. ఈ రెండు సినిమాలను ఆయన సొంత బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమాలలో వాణిశ్రీ నే హీరోయిన్ అవ్వడం మరో విశేషం. అయితే ఆ సినిమాల తరువాత వాణిశ్రీ మళ్ళీ కృష్ణం రాజు గారితో నటించలేదు. అయితే వారి మధ్య విభేదజాలు వచ్చాయంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ విషయాల గురించి ఇమంది రామారావు గారు మాట్లాడారు.

జీవన తరంగాలు సినిమాతో పరిచయం…
ఈ విషయం గురించి ఇమంది రామారావు గారు మాట్లాడుతూ వాణిశ్రీ అప్పట్లో అగ్రహీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో ‘జీవన తరంగాలు’ సినిమాలో శోభన్ బాబుకు జోడిగా నటించారు. ఇక వాణిశ్రీ తమ్ముడిగా కృష్ణం రాజు నటించారు. ఆ సినిమా తరువాత కృష్ణం రాజు గారి సొంత బ్యానర్ లో ‘కృష్ణ వేణి’ అనే సినిమాను తీయాలని కృష్ణం రాజుగారు భావించారు. ఇక అందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకం ఇక అలాంటి పాత్రకు వాణిశ్రీ ని ఎంపిక చేసారు. కన్నడ సినిమా ‘శరపంజరి’ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మళ్ళీ ‘భక్త కన్నప్ప’ సినిమాను కన్నడ రీమేక్ మరోసారి సొంత బ్యానర్ లో కృష్ణం రాజు చేసారు. ఈ సినిమాలో కూడా వాణిశ్రీ మళ్ళీ హీరోయిన్, అయితే ఇక ఈ సమయంలో వీరి మధ్య ఏదో ఉంది అనే పుకార్లు మొదలయ్యాయి.

భక్త కన్నప్ప సినిమా షూటింగ్ కోసం ఒక గూడెంకి వెళ్లి వచ్చాక కృష్ణం రాజు గారికి వాణిశ్రీ గారితో ఉన్న అనుబంధం గురించి ప్రశ్నలు వచ్చాయి. అయితే అలాంటిదేమి లేదంటూ ఇద్దరూ మేము స్నేహితులం అంటూ చెప్పారు. అప్పటికే ఇద్దరికీ పెళ్లిళ్లు అయి ఎవరి జీవితాల్లో వారు స్థిరపడి ఉన్నపుడు ఇలాంటి పుకార్లు మంచిది కాదని కృష్ణం రాజు గారి కుటుంబం కూడా అనడం వల్ల ఇక మళ్ళీ వాణిశ్రీ గారితో ఆయన సినిమా చేయలేదు. చాలా రోజుల తరువాత కృష్ణం రాజు గారు వాణిశ్రీ కలిసినపుడు ఇద్దరూ డాన్స్ చేసి సరదాగా కూడా మాట్లాడుకున్నారు, ఇద్దరూ మంచి మిత్రులు అంటూ చెప్పారు.



























