Imandhi Ramarao : విలనిజంలో ప్రత్యేకమైన డైలాగలతో విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన వ్యక్తి రావు గోపాల్ రావు గారు. ఆయన డైలాగ్ డిక్షన్, నటన అన్నీ కొత్తగా ట్రెండ్ సెట్ చేసాయి. కాకినాడ వద్ద గంగనపల్లిలో జన్మించిన ఆయన ‘భక్త పోతన’ సినిమా ద్వారా మొదటి సారి తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. ఆయన విలనిజం అంత వరకూ ఒక ఎత్తు ‘ముత్యాల ముగ్గు’ సినిమాతో మరో ఎత్తు. ఆ సినిమాలో ఆయన డైలాగులకు ఫ్యాన్ బేస్ వేరు. ఇక ఆయన ‘ప్రేమ అండ్ కొ’ సినిమాలో చివరి సారిగా నటించారు. 1994 లో మధుమేహ వ్యాధి వల్ల మరణించిన ఆయన గురించి ఇప్పటితరానికి అంతగా తెలియకపోవచ్చు. అయితే ఆయన కుమారుడు రావు రమేష్ కూడా సినిమాల్లో మంచి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రానిస్తున్నారు. ఇక ఆయన గురించి ఆయన సినిమాల్లో నటించేప్పుడు ఆయన డెడికేషన్ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన అనుభవాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ కొడుతుంటే రక్తం వచ్చినా అలాగే చేశారు…
‘సర్కస్ రాముడు’ సినిమా షూటింగ్ సమయంలో డైలాగలను మంచి దస్తూరి తో రాయడానికి ఇమంది గారు పనిచేసారట. అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఇమంది గారిని పనిలో పెట్టుకున్నారట. అలా సర్కస్ రాముడు షూటింగ్ సమయంలో అక్కడే ఉన్న ఇమంది రామారావు గారు ఆయన స్వయంగా చూసిన విషయాలు చెప్పారు. సర్కస్ రాముడు సినిమాలో విలన్ గా మొదట నాగభూషణం గారిని అనుకున్నా ఆయన చేయకపోవడిసం వల్ల రావు గోపాల రావు గారిని విలన్ గా పెట్టుకున్నారు.

సినిమాలో ఒక పాటలో విలన్ ను కొడుతూ పాట వస్తుంది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు కోరాడతో కొడుతుంటే నిజంగానే రావు గోపక్ రావు గారికి తగిలి రక్తం వచ్చింది. అయినా ఆయన అలానే చేశారట. ఇక షూటింగ్ అయ్యాక సాయంత్రం చూస్తే వీపు మొత్తం రక్తం కారి షర్ట్ అతుక్కుపోయినా ఆయన అలానే చేసారు. అంతటి డెడికేషన్ గల వ్యక్తి రావు గోపాల్ రావు గారు అంటూ చెప్పారు ఇమంది రామారావు గారు. అయితే ఎన్టీఆర్ గారితో ఆయనకు మంచి హిట్స్ ఉన్నాయని చెప్పారు.



























