Imandi Ramarao : తెలుగింటి కృష్ణ వేణి, తెలుగింటి అహంభావి అయిన భార్య, అత్త, ఇలా ఏ పాత్రయినా వాణిశ్రీ గారే. అలనాటి అభినయ నటి సావిత్రి గారి వారసురాలిగా తనని తాను చెప్పుకునే నటి వాణిశ్రీ గారు హీరోయిన్ గా ఎంత సొగసుగా నటించారో అంతే హుందగా కృష్ణవేణి వంటి పాత్రలను చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పొగరు చూపే అత్తగారి పాత్రలో కూడా అధరగొట్టారు. అలాంటి వాణిశ్రీ గారి జీవితం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామ రావు గారు కొన్ని విషయాలను పంచుకున్నారు.

తమిళనాడు సీఎం గిఫ్ట్… ఎన్నో ఏళ్ల పోరాటం…
వాణిశ్రీ గారు సావిత్రి గారి అభిమాని.. నటనలో ఆమె తనకు దైవం అని ఎన్నో సార్లు చెప్పారు. కొన్ని సినిమాల్లో ఆమె నటన సావిత్రి గారిని గుర్తుకుతెస్తుంది కూడా. అలా ఆమె తన సినిమా కెరీర్ లో ఎన్నో మైలు రాయి లాంటి సినిమాలలో నటించారు. ఇక తాజాగా వాణిశ్రీ గారికి సంబంధిచిన ఒక స్థలం ఎన్నో ఏళ్ళు పోరాడితే చివరికి ఆమెకు దక్కింది అంటూ ఇమంది గారు చెప్పారు. నెల్సన్ రోడ్ లో ఉండే ఒక స్థలం 11 ఏళ్లుగా బోగస్ రిజిస్ట్రేషన్ వల్ల ఇబ్బందుల్లో ఉంది, అయితే అది కోర్ట్ లో కేసు నడుస్తూనే ఉండి వాణిశ్రీ గారు దాన్ని మీద ఆశ వదులుకున్నారు.

అయితే ఇటీవల తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ గారు వాణిశ్రీ గారికి సంబంధిచిన 50 కోట్ల విలువ చేసే స్థలాన్ని అప్పగించారు. ఇక వాణిశ్రీ గారు చేసిన మంచి పనులే తన స్థలాన్ని మళ్ళీ తనకు వచ్చేలా చేశాయని ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక వాణిశ్రీ గారి జీవితంలో గత ఏడాది అత్యంత విషాద సంఘటన జరిగింది. ఆమె తనయుడు ఆత్మహత్య చేసుకుని మరణించారు. వాణిశ్రీ గారు తాను ఆలోచించినట్లే అన్నీ జరగాలని భావించే మనిషి. తన కుటుంబం మొత్తం తన మాట వినాలని అనుకునే రకం, అలాగే కోడలు కూడా ఉండటం వల్ల ఇద్దరికీ చెప్పుకోలేక వాణిశ్రీ గారి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారని ఇమంది గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.































