Imandi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం తాలూకు విషయాలు ఎక్కువగా బయటికి రాలేదు. అంతా కలిసి సంతోషంగా ఉంటున్న వారి కుటుంబంలో ఇటీవలే వరుస విషాదలు చోటు చేసుకున్నాయి. ఇక ఇటీవలే మరణించిన కృష్ణ గారి భార్య ఇందిరా దేవి గారు తన కూతురు మంజుల విషయంలో తీసుకున్న చొరవ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు మాట్లాడారు. మంజుల గారి జీవితంలో ప్రేమ, పెళ్లి తదుపరి విషయాల గురించి మాట్లాడారు.

తొమ్మిదేళ్ల ప్రేమ… ఒప్పుకోని తండ్రి…
మంజుల గారికి మొదటి నుండి సినిమాల మీద చాలా ఇష్టం ఉండేది. తను కూడా హీరోయిన్ అవ్వాలని చాలా అనుకుంది కానీ కృష్ణ గారి అభిమానులు ఆ రోజుల్లో తమ అభిమాన హీరో కూతురు హీరోయిన్ గా రావడం ఇతర హీరోలతో ఆడి పాడటం ఏమిటి అని వారించి వద్దని చెప్పడంతో కృష్ణ గారు మంజుల గారి ఇష్టాన్ని కాదని సినిమాల్లో నటించనివ్వలేదు. ఇక మంజుల గారు ఆమె భర్త సంజయ్ తొమ్మిదేళ్లు ప్రేమించుకున్నారు. అయితే కృష్ణ గారు వారి వివాహానికి ఒప్పుకోలేదు.

ప్రేమ విలువ తెలిసిన కృష్ణ గారు ఇలా చేయడంతో ఆయన భార్య ఇందిర దేవి గారు కృష్ణ గారితో మాట్లాడి ఒప్పించి మంజుల సంజయ్ ల వివాహన్ని జరిపించారు. ఇక మంజుల గారి అభిరుచి మేరకు ‘షో’ అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఆ సినిమాకు అవార్డులు కుడా రావడం విశేషం. ఇక సినిమా ప్రొడక్షన్ లో కూడా ఫ్లాప్స్ అలాగే సక్సెస్ చూసిన మంజుల ‘నాని’ సినిమా వల్ల బాగా నష్టపోయింది. ఇక ఆ తరువాత ‘అర్జున్’ సినిమాలో షేర్ ఇచ్చినా ఆ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించకపోవడం వల్ల ఫలితం లేకపోయింది. ఇక ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలాగే వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతుంది అంటూ మంజుల జీవితం గురించి ఇమంది రామారావు గారు అభిప్రాయపడ్డారు.































