Imandi Ramarao : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో అలాయ్ బలాయ్ నిర్వహించారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. రాకరాక మెగాస్టార్ రావడంతో సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడ్డారు. అలా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయన పై అసహనం వ్యక్తం చేసారు. మీరు ఫోటోలు దిగడం ఆపితే నేను ప్రవచనాలు చెబుతాను లేదంటే నేను వెళ్ళిపోతాను అంటూ అనడంతో మెగాస్టార్ అభిమానులకు కోపం వచ్చింది. ఇక గరికపాటి గారి మీద కు మెగాస్టార్ అభిమాన సంఘం విమర్శలను ఎక్కుపెట్టింది. అయితే ఈ వివాదం ముగిసింది అనే లోపు ఇందులోకి వివాదాల జీవి ఆర్జీవి ఎంటర్ అయ్యాడు. ఇక ఆర్జీవి గరికపాటి మీద చేస్తున్నా వరుస విమర్శల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

గరికపాటి ని టార్గెట్ చేసిన ఆర్జీవి…
అనుష్క ను మా అబ్బాయి చూస్తున్నపుడు నేను ఒకసారి అలా చూసాను కన్నార్పకుండా అన్న గరికపాటి ఒక పాత వీడియోలోని మాటలను ఆర్జీవి ప్రస్థావిస్తూ గరికపాటి గారిని విమర్శించారు. ఇక దీనిపై ఇమంది గారు మాట్లాడుతూ ఆర్జీవి మెగాస్టార్ అభిమానిగా గరికపాటి మీద విమర్శలు చేయడం లేదు, కేవలం ఇద్దరూ కొట్టుకుంటే చూసి ఆనందించాలనే సైకో ఆనందంతో ఇలా చేస్తున్నాడు. నిజంగా మెగాస్టార్ అభిమాని అయితే ఇప్పుడు చిరంజీవి కాదు అల్లు అర్జున్ మెగాస్టార్ అంటూ మాట్లాడడు.

అల్లు, మెగాస్టార్ ఫ్యామిలీ మధ్య చిచ్చు మొదట పెట్టిందే ఆర్జీవి అంటూ అభిప్రాయపడ్డారు. ఒకప్పటి ఆర్జీవి ఇపుడు లేడు. అయినా గరికపాటి గారు అనుష్క అందానికి ఆకర్షితుడైనాను అని చెబితే అందులో తప్పేమిటి, ఆయన ప్రవచనకర్త అంతే, ఆయన వర్ణించకూడదు అని లేదు కదా. అలాగే అయినా అసభ్యకరంగా ఏమీ వర్ణించలేదు కదా అంటూ ఇప్పుడు ముగుస్తున్న వివాదాన్ని మరోసారి రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు తప్ప చిరంజీవి మీద అభిమానంతో కాదు అంటూ చెప్పారు.































