Imandi Ramarao : యూట్యూబ్ ద్వారా పలు సామాజిక, రాజకీయ అంశాల మీద తన ఒపీనియన్ చెబుతూ ఆ సంఘటనను విశ్లేషించే సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు తాజాగా చిరంజీవి గారు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాను ప్రమోట్ చేస్తుండడంతో బాగా ట్రోల్స్ కి గురవుతున్నారు. ఇక సీనియర్ హీరోయిన్, పోలిటీషియన్ ఐన విజయం శాంతి గారు విమర్శించారు. ఇక ఈ ఇష్యూ పై ఇమ్మంది గారు మాట్లాడారు.

చిరంజీవి చేసిన తప్పేంటి…
అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విషయంలో మొదటి నుండి ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ట్వీటర్ లో కొంతమంది బ్యాన్ లాల సింగ్ చద్దా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. 2015 లో అమీర్ ఖాన్ భారత దేశంలో జీవించాలంటే భయమేస్తోందని, స్వేచ్చ గా జీవించే పరిస్థితులు లేవని వాఖ్యణించారు. ఇక అప్పుడు ఆయన చేసిన వాఖ్యలు ఇపుడు వైరల్ అవుతూ ఆయన సినిమాను బ్యాన్ చేయాలంటూ వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే దీనికి స్పందిస్తూ అమీర్ వివరణ కూడా ఇచ్చినా ఈ ఇష్యూ సమసిపోలేదు. అయితే ఇలాంటి తరుణంలో చిరంజీవి లాల్ సింగ్ చద్దా సినిమా కు సమర్పుకుడిగా వ్యవహారిస్తూ తెలుగులో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ట్రోల్ కి గురవుతున్నారు.

ఇదే విషయంలో విజయశాంతి కూడా విమర్శించడం తో హాట్ టాపిక్ అయింది. ఇక ఇమ్మంది మాట్లాడుతూ చిరంజీవి చేసిన తప్పేంటి, ఒక హిందీ సినిమాను ప్రమోట్ చేయడం తప్పా.. ఆ సినిమాలో నాగార్జున తనయుడు నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. కాబట్టి నాగార్జున చిరంజీవి కి మంచి స్నేహితుడు అవ్వడం వల్ల నాగ్ చైతన్య కోసం ప్రమోట్ చేస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ ఏపుడో చేసిన వాఖ్యలను ఇప్పుడెందుకు రాద్ధాంతం చెస్తున్నారు. సినిమాను, రాజకీయాన్ని వేరుగా చూడాలి. ఆయన ఎందుకు అలా వాఖ్యలు చేసారో అది ఆయనను అడిగి తెలుసుకుంటే సరిపోతుంది. మన దేశంలో రక్షణ గురించి మనం నిజాలు మాట్లాడుకోకూడదు నిష్టురంగ ఉంటాయి. రక్షణ బాగుంటే ఎందుకు నిర్భయ, దిశా లాంటి చట్టాలు వస్తాయి అంటూ మాట్లాడారు.































