Imandi Ramarao : హీరోయిన్ గా దశాబ్దం పాటు ఏలిన జయచిత్ర అప్పట్లో శోభన్ బాబు, కృష్ణ, మురళి మోహన్ వంటి హీరోలకు హిట్ పెయిర్ గా నిలిచింది. జయచిత్ర తల్లి హీరోయిన్ కావడం వల్ల చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయచిత్ర హీరోయిన్ గా మంచి సక్సెస్ చూసింది. చెన్నై లో పుట్టి పెరిగిన జయచిత్ర అసలు పేరు రోహిణి. ఆమె తన అమ్మమ్మ తో ఎక్కువగా పెరిగింది. ఇక సినిమాల్లో దశాబ్దం పైగా నటించి హిట్లు అందుకున్న ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయినా వివాహం విషయంలో మోసపోయింది అనే వార్తలు అప్పట్లో వినిపించాయి.

జయచిత్ర ను మోసం చేసిన స్టార్ కమెడియన్…
జయచిత్ర జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిల్లో ఒకరైన ఇమంది రామారావు గారు ఆవిడను మోసం చేసిన వ్యక్తుల గురించి చెప్పారు. ఇమంది రామారావు గారు జయచిత్ర ఇంట్లో 75 రూపాయలకు అభిమానులకు ప్రత్యుత్తరాలు రాసే పనికి చేరినప్పటి నుండి ఆమెతో పరిచయం ఉందని చెప్పారు. ఇక ఆమె అప్పట్లో ఉన్న కమెడియన్ సుధాకర్ ను ప్రేమించారని చెప్పారు. సుధాకర్ చాలా నమ్మించి ఆమెను ట్రాప్ చేశాడంటూ చెప్పారు. వేరే అమ్మాయిని సుధాకర్ పెళ్లి ఒక గుడిలో చేసుకుంటున్న విషయం తెలిసి చాలా బాధపడిందట. నమ్మితే ఇలా మోసం చేసాడు అంటూ చాలా బాధపడి వెంటనే తను పెళ్లి చేసుకోవాలని అనుకుని గణేష్ అనే ఒక వ్యాపారి ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన అపద్దాలను చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్న సంగతి ఆలస్యంగా ఆమెకు తెలిసింది.

ఇక ప్రేమించినవాడు మోసం చేయడం మళ్ళీ పెళ్లి చేసుకుంటే అతను అపద్దాలను చెప్పి పెళ్లి చేసుకోవడం వంటివి ఆమెను చాలా నిరాశకు గురిచేసాయట. ఇక జీవితంలో ఎవరు చెప్పిన దాన్ని నమ్మకూడదు అనేంతలా ఆమె మారిపోయారట. అప్పటినుండి మొత్తం ఇంటి వ్యవహారాలు బిడ్డకు సంబంధించిన అన్ని విషయాలను ఆమె స్వయంగా చూసుకునే వారట. అయితే భర్త నుండి విడిపోలేదు ఇక 2020 లో జయచిత్ర భర్త మరణించారు. అలా జీవితంలో ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడం వల్ల ఆమె చాలా మారిపోయారని ఇమంది రామారావు అయన జ్ఞాపకాలను పంచుకున్నారు.



























