Imandi Ramarao : టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నపుడే కాదు ఆరు పదుల వయసులో కూడా అమ్మాయిలకు అభిమాన హీరోగా ఉన్నాడు. రొమాంటిక్ హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్న నాగార్జున అంటే చాలా మంది అమ్మాయిలకు ఇష్టం. ఇక అప్పట్లో గ్రీకు వీరుడు అంటూ పాటలు పాడేసుకునేవారు. ఇక నాగార్జున అంటే సాధారణ అమ్మాయిలే కాదు సెలబ్రిటీలు కూడా పడిపోయేవారు. చాలా మంది హీరోయిన్లకు నాగార్జున మీద క్రష్ ఉండేదంటూ వార్తలు ఉన్నాయి. ఇక ప్రతి హీరోకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది ఈ హీరోయిన్ తో రిలేషన్ ఉంది అంటూ వార్తలు మామూలే, అలాగే నాగార్జున కి హీరోయిన్ టబు తో ఎఫైర్ ఉంది అంటూ బాగా పుకార్లు ఉన్నాయి.

వాళ్లిద్దరి విషయంలో అమల ఏం చేసింది…
హీరో నాగార్జున దగ్గుబాటి వారి ఆడబిడ్డ లక్ష్మి ని పెళ్లిచేసుకుని ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. అయితే నాగార్జున కు ‘నిన్నేపెళ్లాడుతా’ సినిమా తరువాత టబు తో ఎఫైర్ ఉంది అనే వార్తలు బాగా వినిపించాయి. ఆ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య నడిచే కెమిస్ట్రీ అలాంటిది మరి. ఇక ఇప్పటికీ టబు పెళ్లి చేసుకోకుండా ఉండిపోడానికి నాగార్జున కారణం అంటూ గాసిప్స్ గట్టిగా వినిపిస్తుంటాయి. మొన్నామధ్య టబు ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోకపోడానికి కారణం అదే అంటూ చెప్పడం, అదే అంటే నాగార్జున తో ఎఫైర్ అనేనా అంటూ అర్థాలు తీశారు. హైదరాబాద్ లో ఇల్లు ఉండటం తరచూ హైదరాబాద్ కి వస్తుండడం ఇవన్నీ నాగ్ కోసం అంటూ బాగా ప్రచారం ఉంది.

ఇక ఈ విషయం గురించి ఇమంది రామారావు గారు మాట్లాడుతూ వాళ్లిదరి మధ్య బంధం నిజమే అన్నట్లుగా అభిప్రాయపడ్డారు. శోభన్ బాబు, జయలలిత మధ్య లాగా వీళ్లిదరి మధ్య చక్కటి అనుబంధం ఉందంటూ చెప్పారు. అయితే అమల ను ఈ విషయంలో మెచ్చుకోవాలి అంటూ కామెంట్స్ చేసారు. అమల వాళ్లిదరి మధ్య బంధం గురించి ఎక్కువగా బాధపడలేదు, ఆమెను ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చూసింది. టబు కానీ నాగార్జున కానీ వాళ్ల కుటుంబాలు ఇబ్బంది పడకుండా వారి స్నేహం కొంసాగించారు. టబు నాగార్జున కోసమే పెళ్లి చేసుకోలేదు అంటూ చెప్పారు.
































