నోరుజారి వర్షతో ఉన్న లవ్ ట్రాక్ గురించి బయట పెట్టేసిన ఇమ్మానియేల్..?

0
810

తెలుగు బుల్లి తెరపై విశేష ప్రజాదరణ పొందిన షోలలో జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది కామెడీ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత జబర్దస్త్ ప్రోగ్రామ్ షో కే దక్కుతుంది.ఈ మధ్యకాలంలో జబర్దస్త్ వేదికపై అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు ఇమాన్యూయేల్ తక్కువ టైం లో ఎక్కువ పాపులర్ అయ్యాడు.

జబర్ధస్త్‌ షోలో బాగా పాపులర్ అయిన వర్ష , ఇమాన్యూయేల్ జంట ప్రస్తుతం బుల్లితెర జంటగా ఫేమస్ కావడంతో బుల్లితెరపై అనేక షోలలో అద్భుత పర్ఫామెన్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికితోడు వర్ష ,ఇమాన్యూయేల్ జంటపై నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం వైరల్ అవుతుండడంతో వీరు చేస్తున్న స్క్రిప్ట్ లు అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందడంతో పాటు అధిక రేటింగ్ సొంతం చేసుకున్నాయి.

తాజాగా వచ్చే వారం ప్రసారమయ్యే ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌ ప్రోమోలో ఇమాన్యూయేల్, వర్ష జంట స్క్రిప్ట్ లో భాగంగా వర్షను చిత్తు కాగితాలు ఏరుకునే అమ్మాయిలా చూపించారు. స్లమ్‌లో ఉన్న వర్షను చూసిన ఇమాన్యూయేల్ ఇంత అందం పెట్టుకుని ప్లాస్టిక్ పేపర్లు ఏరుతున్నావా…నువ్వు నన్ను నమ్మి నాతో వచ్చేయ్…నిన్ను పెద్ద హీరోయిన్‌ చేస్తా అంటాడు. దానికి బదులుగా వర్ష పిచ్చిదాన్ని సార్ అని బదులిస్తుంది.

వర్ష అన్న ఆ మాటకు ఇమాన్యూయేల్ బదులిస్తూ.. తెలుసమ్మా అందుకే కదా నన్ను ప్రేమిస్తున్నావు అని కామెంట్ చేసి వీరిద్దరి ప్రేమ వ్యవహారం పై ఉన్న సందేహానికి మరింత అనుమానం పెంచాడు. ఇమ్మానియేల్ ఈ విధంగా చెప్పడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తోందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here