Indhira devi : సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారు ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పలు మార్లు ఆసుపత్రి కి వెళ్తూ వచ్చేవారు. అయితే మామూలుగా వెళ్లి వచ్చేస్తారు అని అందరూ అనుకున్నా ఈ సారి మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆవిడ మరణం కృష్ణ గారిని ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఇంతవరకు ఎపుడు బయటికి కృష్ణ గారి భార్య ఇందిర గారు మీడియా ముందుకు రావడం జరగలేదు. ఆవిడ గొప్ప వ్యక్తిత్వం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు అప్పటి సంఘటనలు, విజయ నిర్మల గారితో కృష్ణ గారి పెళ్లి వంటి విషయాల గురించి చెప్పి ఆమె వ్యక్తిత్వం ఇలాంటిదో అందరికీ తెలియజేసారు.

విజయనిర్మల ను పెళ్లి చేసుకుని వస్తే ఇందిర గారి స్పందన…
1962 నవంబర్ లో కృష్ణ గారితో ఇందిరాదేవి గారి పెళ్లి జరిగింది. ఆమె ఊరు కంచెర్ల పాలెం అయితే కృష్ణ గారిది బుర్రిపాలెం. ఇక వారికి పెద్దబ్బాయి రమేష్ పుట్టాక కృష్ణ గారికి సినిమాల్లో అవకాశం వచ్చి రెండు సినిమాల్లో హీరోగా సంతకం చేసారు ఒకే బ్యానర్ కు, అలా తేనెమనసులు, కన్నె మనసులు వంటి సినిమాల్లో నటించారు కృష్ణ. ఇక 1970 వరకు కృష్ణ గారు వరుసగా సినిమాలను చేసారు. అయితే ఆయన సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ గా విజయ నిర్మల ఉండటం వల్ల పరిచయం ప్రేమ గా మారి పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. విజయనిర్మల గారు తెలుగులో సినిమాల్లోకి వచ్చే సమయానికి పెళ్ళై నరేష్ ఉన్నాడు. ఇక కృష్ణ గారు విజయనిర్మల ను పెళ్లి చేసుకున్నాక ఇంట్లో వాళ్ళను ఒప్పించాలని అనుకున్నారు. ఇక కృష్ణ గారి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోక పోయినా మెల్లగా తల్లి వారి బంధాన్ని ఒప్పుకున్నారు. ఇక ఆమె కోడలిని ఒప్పించే ప్రయత్నం చేయాలని అనుకున్నా అప్పటికే జరుగుతున్న విషయాలకు ఆశ్చర్యపడిన ఇందిరా దేవి గారు వాటి నుండి తేరుకొని గొడవ చేయాలని అనుకోలేదు, అయితే కృష్ణ గారు ఇచ్చిన ఒక మాట ఆమెను వారి బంధాన్ని అంగీకరించేలా చేసింది.

అదే నీకు ఇటువంటి అన్యాయం జరగదు అలాగే ప్రేమ పంచడం లో ఎటువంటి లోటు ఉండదు అని కృష్ణ గారు ఇచ్చిన మాట. ఇక ఆ మాటకు ఇందిరా గారు కన్విన్స్ అయ్యారు. ఇక విజయనిర్మళ గారి పెళ్లి జరిగాక వారి ఇద్దరికీ పిల్లలు లేరు కానీ మహేష్ బాబు తో సహా అందరూ విజయనిర్మల గారు కృష్ణ గారి జీవితంలోకి ప్రవేశ్నించాకే పుట్టినవారు. అలా కృష్ణ గారు ఇద్దరు భార్యలను ఒప్పించి సమంగా ప్రేమను పంచడం వల్ల ఆ కుటుంబం ముక్కలు కాకుండా నిలబడింది. అలాగే ఇందిర గారి గొప్ప నిర్ణయం 1967 సమయంలోనే ఆమె ఆలోచించిన తీరు ఆమె కుటుంబం విడిపోకుండా కృష్ణ గారు సినిమాల్లో ఎదగడానికి ఒక రకంగా కారణం అయ్యారు అంటూ భరద్వాజ గారు ఇందిర గారి గొప్పతనం గురించి చెప్పారు.




























