Indhu Anandh : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు సినిమాలు ఇటు సీరియల్స్ లో నటిస్తున్న నటి ఇందు ఆనంద్. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ తో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇందు ఆనంద్ సినిమాల్లోనూ చేసిన కొన్ని వాటిలోనే గుర్తింపు ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి పాత్రలను చేసిన ఇందు ప్రస్తుతం గమనం, బుడుగు వంటి చిత్రాల్లో నటించారు. రెమ్యూనరేషన్ గురించి ఏరోజు డిమాండ్ చేయలేదని ఒక సంస్థతో పనిచేసాక మళ్ళీ అదే సంస్థ తో పనిచేయడానికి ఇష్టపడుతానని, కళ్యాణ వైభోగమే టీం తో నాలుగున్నరేళ్లు పని చేశాను మళ్ళీ వాళ్ళతోనే కళ్యాణం కమనీయం లో చేస్తున్నాను అలాగని ఎక్కువ పారితోషకం ఇవ్వమని అడగలేదు అని చెప్పారు ఇందు.

నా కూతురి విషయంలో ఇండస్ట్రీ నుండి ఎటువంటి సహాయం లేదు…
ఇందు ఆనంద్ ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అలాగే సీరియల్స్ లోనూ నటించినా చిన్నతనంలో చాలా అల్లరిగా ఉండేవారట. ఇక ఇంటర్మీడియట్ చదువుయ్యాక ఉద్యోగం రావడం తో చదువు ఉద్యోగం రెండింటిని కొంసాగించిన ఇందు, తమ్ముడు, అన్న తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపారు. ఇక పెళ్ళయ్యాక ఒక పాప పుట్టాక ఉద్యోగం మానేసాను అంటూ వ్యక్తిగత విషయాలను చెప్పిన ఇందు పాప పుట్టాక జీవితం మారిపోయిందని చెప్పారు. పాపకు మానసిక సమస్యలు ఉండటం వళ్ల ఇంకా చిన్నపిల్లలాగే ఉండిపోవడంతో తాము సాధారణ పిల్లల లాగా అవుతుందనే భావించి చాలా ఏళ్ళు ఆలోచించానని అన్నారు. ఇక డాక్టర్లు తాను అందరిలా ఉండదు దీన్ని మీరు అంగీకరించినపుడే హ్యాపీ గా ఉంటారు. అని చెప్పాక తనను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. నా సొంత బంధువుల నుండి కానీ, ఇండస్ట్రీ నుండి కానీ ఎటువంటి సహాయం కోసం నేను ఎదురుచూడలేదు.

నాకు ఆ అవసరం లేదు నేను ఉన్నంత వరకు తనని నేను చేసుకోగలను, 42 సంవత్సరాలనుండి చూసుకుంటున్నాను, నా తరువాత ఎవరో చూస్తారని భావించడం లేదు కానీ నా సోదరుల పిల్లలు, అక్క పిల్లలు వైద్య వృత్తిలో బాగా స్థిరపడ్డారు. వాళ్ళు చూసుకుంటారని ఆశిస్తున్నాను. కానీ నా కంటే ముందే నా బిడ్డ పోతే బాగుండు అని అనిపిస్తుంది. ఇంకొకరిని తనకోసం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అంటూ చెప్పారు. గిరిబాబు, చంద్ర మోహన్ గారితో ఎక్కువ సినిమాల్లో నటించిన ఇందు గారు, చంద్ర మోహన్ గారితో మంచి అనుబంధం ఉందని ఆయన భార్య జలందర కూడా పరిచయం అని చెప్పారు. ఒక సోదరిలా నన్ను చూస్తారని, ఇక గిరిబాబు గారు ఇప్పటికి నన్ను పలకరిస్తారని చెప్పారు ఇందు ఆనంద్.



























