దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశం మొత్తం మీద 4 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో ఐసోలేషన్ క్యాబిన్ల తయారీకి రైల్వేశాఖ కసరత్తులు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోధావరి జిల్లా కాకినాడ పోర్టు స్టేషన్ లో రైల్వే భోగీలను ఐసోలేషన్ క్యాబిన్లుగా మార్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది విజయవాడ డివిజన్ పరిధిలో 32 రైల్వే భోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు, 13 భోగీలను కాకినాడలో తయారు చేసారు.
ఇందులో ప్రతి కేబిన్ ను విడదీసి మరుగుదొడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు అమర్చి వివిధ రాష్ట్రాలకు తరలించారు. కరోనా తగ్గిన్ తరువాత వాటిని ప్రజారవాణాకు అనుకూలంగా మార్చారు. ఇప్పుడు మళ్ళీ కరోనా ఉదృతి పెరుగుతున్న దృశ్యా మరోసారి ఐసోలేషన్ క్యాబిన్ల తయారీకి రైల్వేశాఖ సనాహాలు చేస్తోంది.































