ఫిబ్రవరి 14th, ప్రేమికుల దినోత్సవం వస్తే చాలు ప్రేమికులంతా వారి వారి ప్రేమించిన వ్యక్తితో గడపాలని అనుకుంటారు. ప్రేమికులిద్దరు కలిసి రెస్టారెంట్లకు, షాపింగులకు, పబ్ లకు, మాల్స్ లకు తిరుగుతూ ఉంటారు. వారి ప్రేమని వ్య్కపరిచుకుంటూ ఉంటారు. ఇంత డిమాండ్ ఉన్న ఈరోజును క్యాష్ చేసుకునేందుకు అనే ఆఫర్లు ప్రవేశపెడుతూ ఉంటారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్స్ వంటివి స్పెషల్ ఆఫర్లు ఇచ్చిమరీ ప్రేమికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. తాజగా ప్రముఖ విమానయాన సంస్థ అయినా ఇండిగో కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి 14వ తారీకు వరకు నాలుగు రోజులపాటు 999/- రూపాయలకే టికెట్ ను విక్రయిస్తోంది. అదికూడా అన్ని టాక్స్ లు కలిపి కేవలం 999/- రూపాయలకు విమాన టికెట్ ను అందిస్తుంది. ఈ సెల్ ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు మాత్రమే. ఇందుకోసం మొత్తం పది లక్షల సీట్లను కేటాయించింది ఇండిగో విమానాయన సంస్థ.

వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ ను పొందాలంటే ఫిబ్రవరి 11 నుంచి 14 వ తేదీ మధ్యలో బుక్ చేసుకుని, మార్చి 1వ తేదీ నుండి.. సెప్టెంబర్ 30వ తేదీ మధ్యలో ప్రయాణం చేయాలి. మార్చి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ప్రయాణించే వారికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే మార్చి – సెప్టెంబర్ మధ్య ప్రయాణించడానికి ఫిబ్రవరి 11 నుంచి 11వ తేదీ మధ్యలో ఈ ఆఫర్ అప్లై చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటే మన దేశంలో ఒక నగరం నుండి వేరొక నగరానికి కేవలం 999/- రూపాయిల టిక్కెట్టు తో ప్రయాణించవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూర్ కు కేవలం 999/- రూపాయలతో ప్రయాణించవచ్చు. ప్రేమికుల రోజు సంబరాలను మేము ముందుగానే మొదలుపెట్టామని.. ఇండిగో సంస్ద చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టార్ అన్నారు. ఈ అఫర్ కార్పొరేట్ కస్టమర్లకు, విహారయాత్రలకు వెళ్లే ప్రయాణికులు తమ వెబ్సైటు నుంచి టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులంతా ఈ ఆఫర్ సద్వినియోగ పరుచుకుంటారని ఆశించారు విలియం బౌల్టార్. అంతే కాదు ఫెడరల్ బ్యాంకు, పే జాప్, ఇండస్ఇండ్ బ్యాంకు డెబిట్ కార్డులపై 5000 వరకు క్యాష్ బ్యాక్ కూడా కలదు. ఇంకేంటి ఆలస్యం ఇండిగో వెబ్ సైట్ ఓపెన్ చేయండి మీకు నచ్చిన నగరానికి వెళ్లే ప్లాన్ చేసుకోండి.

అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా కేవలం 999/- రూపాయలకే ఫ్లైట్ టికెట్ ఈ అఫర్ మొదలైనా… హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వెళ్లే విమానాలలో ఈ టిక్కెట్లు అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి కనీస టికెట్ ధర 1500/- రూపాయలుగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here