Indraja : 1994 లో వచ్చిన ‘యమలీల’ సినిమాతో తెలుగు తెరకు పరికచయం అయ్యింది ఇంద్రజ. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. యమలీల సినిమా తరువాత రెండేళ్లలో 30 సినిమాలు తీసేలా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇంద్రజ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 80 సినిమాలలో నటించింది. అయితే వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యింది ఇంద్రజ. ఇపుడు మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. అంతే కాకుండా బుల్లితెర మీద పలు ప్రోగ్రాములకు న్యాయ నిర్ణేతగా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రజకు సంబందించిన ఒక విషయం వైరల్ అవుతోంది.

ఆటోలో షికార్లు కొడుతున్న ఇంద్రజ…
సోషల్ మీడియా పుణ్యమా అని సమాజంలో సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. సినిమా తారలు, బుల్లితెర తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు వీళ్ళు మాత్రమే సెలబ్రిటీలు అనుకునే రోజులు పోయాయి. యూట్యూబ్ చానెల్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్ అంటూ చాలామంది వారి టాలెంట్ తో సులభంగా సెలబ్రిటీలుగా మారుతున్నారు. సెలబ్రిటీలు సామాన్యుడిలా బయట తిరగడం, షాపింగ్, రెష్టారెంట్లకు వెళ్లడం చేయలేరు. కానీ వాళ్లకు కూడా ఈ సరదాలు ఉంటాయి. అందుకే విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చేస్తుంటారు.

ఇక వీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం జరగని పని. అయితే తాజాగా ఇంద్రజ తన ముఖాన్ని మాస్క్ తో దాచేసి ఎవరూ గుర్తుపట్టకుండా హైదరాబాద్ వీధుల్లో ఆటోలో తిరిగి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇంద్రజ… కారులో అన్నీ డోర్లు మూసుకొని ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఆటోలో ఇలా ప్రయాణించడం చాలా బాగుంది అని చెప్పుకొచ్చింది.



























