అహ్మదాబాద్‌లో జూన్ 12న చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం భారత ఏవియేషన్ చరిత్రలోనే ఒక భయంకర ఘట్టంగా మారింది. లండన్‌కి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడంతో మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరే బ్రతికిపోయారు. అంతేకాదు, విమానం ఒక మెడికల్ హాస్టల్ భవనంపై పడిపోవడంతో మరో 38 మంది మెడికల్ విద్యార్థులు కూడా మృతిచెందారు. మరణించినవారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు.

భారీ బీమా క్లెయిమ్: దేశ చరిత్రలోనే రికార్డు స్థాయి
ఈ ప్రమాదానికి సంబంధించి బీమా కంపెనీలు ఎదుర్కొనే నష్టాలు గణనీయంగా ఉండబోతున్నాయి.
జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC Re) అంచనా ప్రకారం:
- మొత్తం బీమా క్లెయిమ్‌లు: 475 మిలియన్ డాలర్లు
- భారత కరెన్సీలో విలువ: సుమారు రూ. 4,091 కోట్లు
- ఇది దేశంలో ఇప్పటివరకు నమోదైన అత్యంత భారీ విమాన బీమా క్లెయిమ్ కావొచ్చని నిపుణులు అంటున్నారు.
క్లెయిమ్ బ్రేక్‌డౌన్ ఇలా :
- విమానం నష్టం:
అంచనా విలువ: $125 మిలియన్ (రూ. 1,000 కోట్లు) - ప్రయాణికుల బాధ్యత, థర్డ్ పార్టీ బాధ్యత, వ్యక్తిగత ఇన్సూరెన్స్‌లు:
కలిపి: $350 మిలియన్ (రూ. 3,000 కోట్లు)
ఈ మొత్తం క్లెయిమ్‌లో ప్రయాణికులు తీసుకున్న వ్యక్తిగత ప్రమాద బీమాలు, క్రెడిట్ కార్డు బీమాలు, ఓవర్సీస్ ట్రావెల్ పాలసీలు, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన లాంటి పథకాల పరిధిలో వచ్చే డబ్బులు కూడా ఉన్నాయి.
విమానం విలువ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ నష్టం
విమానం అసలు విలువ సుమారు రూ. 1,000 కోట్లు అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి తలెత్తిన బీమా క్లెయిమ్‌లు, పరిహారాలు కలిపి దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇది భారత ఇన్స్యూరెన్స్ రంగాన్ని భారీ ఒత్తిడికి గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఘటన మరొకసారి బీమా రంగంలో రిస్క్ అసెస్‌మెంట్, ప్రయాణ భద్రతా ప్రమాణాల ప్రాధాన్యతను సూచిస్తోంది. ప్రాణ నష్టం చెల్లించలేనిది అయినా, ఆర్థిక భద్రత కోసం బీమా వ్యవస్థ ఉండటం ఎంత కీలకమో ఈ ఘటన ద్వారా స్పష్టమైంది.





























