కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో పీఎఫ్ పై కీలక నిర్ణయం తీసుకుంది. అధిక వేతనం ఉన్న ఉద్యోగుల పిఎఫ్ వడ్డీపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. ఈ నేపధ్యంలో ఒక ఆర్ధిక సంవత్సరంలో ఉదోగి తరపున జమచేసే పీఎఫ్ చందా రూ.2.5 లక్షలు మించితే, వడ్డీ ఆదాయంపై 1 శాతం పన్ను విధించనున్నారు.

అయితే ఈ భారం కేవలం అధిక వేతనం ఉన్న వారిపై మాత్రమేనని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. నెలకు రూ.2 లక్షలలోపు జీతం అర్జించే వారిపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. రూ.2 లక్షలకంటే ఎక్కువ అర్జించే వారికి మాత్రమె ఇది వర్తిస్తుందని తెలిపింది. కాగా తాజా పన్ను ఏప్రిల్ 1, 2021 నుంచి పీఎఫ్ ఖాతాలలో చేసే జమల నుంచి ఇది అమలులోకి రానుంది.