కొంతమంది హీరోయిన్స్ ఏ ఇండస్ట్రీలో ఎక్కువగా రాణిస్తారో చెప్పడం కాస్త కష్టమే. తమిళ ప్రేక్షకులకు బొద్దుగా ఉండే హీరోయిన్స్ బాగా నచ్చుతారు. అందుకే అక్కడ హన్సిక బాగా క్రేజ్ సంపాదించుకుంది. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌ను అభిమానించడం మొదలుపెడితే నాలుగైదు సినిమాలకే గుడి కట్టేస్తారు. అంతగా హీరోయిన్స్ మీద తమిళ తంబీలు ఆదరణ చూపిస్తారు. ఆదరణ అనే దానికంటే ఆరాదిస్తారంటే కరెక్టేమో. ఇటీవల ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించిన భూమి, ఈశ్వరన్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో నభా అక్కడ జనాలకు తెగ నచ్చేసింది.

ఇప్పుడు ఆమెకు తమిళ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. తెలుగులో పవన్ కళ్యాణ్, గల్లా అశోక్ సినిమాలు చేస్తున్న నిధికి తమిళంలో మరో రెండు ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు దక్కినట్టు సమాచారం. చాలామంది హీరోయిన్స్ ముంబైలో సెటిలవ్వాలనుకుంటారు. అక్కడ హిందీ మార్కెట్ ఎక్కువ. బాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతాయి కాబట్టి హీరో, హీరోయిన్స్ అందుకునే రెమ్యునరేషన్ కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఇచ్చేదానికంటే రెట్టింపు ఉంటుంది. హిందీ సినిమా చేస్తే దాదాపు పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ దక్కినట్టే అనేది హీరోయిన్స్ ఫీలింగ్.

అయితే బాలీవుడ్‌లో అంతగా ఆదరణ లభించని హీరోయిన్స్ అంతా చూస్తుంది టాలీవుడ్ వైపే. ఇక్కడ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే తెలుగు ప్రేక్షకులు, నిర్మాతలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. హిట్ పెయిర్ అనిపిస్తే అదే హీరోయిన్‌ను వరుసగానూ రిపీట్ చేస్తుంటారు. అందుకే బాలీవుడ్ లో సక్సెస్‌లు సాధించలేకపోయిన పూజా హెగ్డే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకొని ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిలవ్వాలని చూస్తోంది. టాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిన రష్మిక ఇప్పుడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదే.

ఇక ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ముందు హీరోయిన్‌గా పరిచయమైంది హిందీ ఇండస్ట్రీలలోనే. కానీ ఆమెకు సౌత్‌లోనే స్టార్ డం వచ్చి క్రేజీ హీరోయిన్‌గా మారింది. వీరందరికంటే ముందు నుంచి కాస్తో కూస్తో హిందీ కంటే తెలుగు సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఇమ్రాన్ హష్మీ నటించిన జన్నత్ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె.. రెండవ సినిమా తెలుగులో చేసింది. హ్యాపీడేస్ ఫేం రాహుల్ సరసన నటించిన రెయిన్‌బో సోనాల్ చౌహాన్ మొదటి తెలుగు సినిమా.

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, రామ్ సరసన పండగ చేసుకో, అనుష్క, ఆర్య నటించిన సైజ్ జీరో, మళ్ళీ బాలయ్యతో డిక్టేటర్, రూలర్ వంటి సినిమాలు చేసింది. చెప్పాలంటే సోనాల్‌కు బాలయ్య సినిమాలు బాగానే పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎఫ్3 మల్టీస్టారర్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర బాగా గ్లామరస్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే 2008లో హీరోయిన్‌గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనాల్ క్రేజీ స్టార్ హీరోయిన్‌గా మాత్రం వెలగలేకపోయింది.






























