ఆ కాలంలో పద్మనాభం నటించిన సినిమాలు జనాలకు ఎంతగా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేవో ఇప్పుడు సంపూర్ణేశ్ బాబు సినిమాలు అలాంటి ఎంటర్‌టైన్మెంట్‌ను ఇస్తున్నాయి. నటన పరంగా ఇద్దరికీ ఏమాత్రం పోలిక ఉండకపోయినా జనాలను ఎంటర్‌టైన్ చేయడంలో మాత్రం కాస్త ఒకే స్టైల్ కనిపిస్తుంటుంది. ఇప్పటి సంపూను అప్పటి పద్మనాభం తో పోల్చడం ఏంటీ అని కొందరు అనుకోవచ్చు. కానీ ఓ కంపేరిజన్ ఉంటేనే కదా ఆ నటుడిని గుర్తించగలిగేది. అందుకే ఈ కంపేరిజన్.

సంపూలో మంచి నటుడు లేకపోతే దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపిస్తారా. సంపూర్ణేశ్ బాబు మొదటి సినిమా హృదయకాలేయం. ఈ సినిమాతో సంపూకి వచ్చిన క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఎక్కడో చిన్న షాప్ పెట్టుకొని పనిచేసుకుంటున్న సంపూర్ణేశ్ బాబు హృదయకాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్‌గా పాపులర్ అయ్యాడు. టాలీవుడ్‌లో ఓ వెరైటీ హీరో వచ్చాడని అందరూ మాట్లాడుకున్నారు. సంపూ సినిమా అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటున్నాయి.

సంపూ సినిమా ఓ మెడిసిన్ లాంటిది. ఎవరికి ఎలాంటి టెన్షన్ ఉన్నా కాసే ఈ బర్నింగ్ స్టార్ సినిమా చూస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. అందరు హీరోలను ఇమిటేట్ చేయడం సంపూలో ఉన్న స్పెషల్ టాలెంట్. అంతేకాదు ఏకధాటిగా 5 పేజీల డైలాగులున్నా సింగిల్ టేక్‌లో చెప్పే కెపాసిటీ ఉంది. సంపూ మన టాలీవుడ్ హీరోలను ఎంత బాగా ఇమిటేట్ చేస్తాడో దాని ద్వారా సినీ ఇండస్ట్రీలోని మోహన్ బాబు లాంటి స్టార్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడో అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంపూ సినిమాకు బడ్జెట్ తక్కువే. కానీ నిర్మాతలకు మాత్రం మంచి లాభాలు వస్తున్నాయి.

ఒక్క హృదయకాలేయం సినిమా సంపూను ప్రేక్షకులను బాగా దగ్గరచేసింది. ఆ తర్వాత వచ్చిన కొబ్బరి మట్ట, సింగం 123 సినిమాలు సంపూకి మరింత క్రేజ్ తీసుకు వచ్చాయి. మధ్యలో కరెంట్ తీగ లాంటి సినిమాలో ఏకంగా సన్నీలియోన్ సరసన నటించే ఛాన్స్ కూడా అందుకున్నాడు. హీరోగా చేస్తూనే కొన్ని సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చే పాత్రలను చేస్తున్నాడు. ప్రస్తుతం సంపూర్ణేశ్ బాబు క్యాలీ ప్లవర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పటిలాగే సంపూ ఈ మూవీ ట్రైలర్‌లో అదరగొట్టాడు.

సంపూ డైలాగ్ డెలివరీ, పర్ఫార్మెన్స్ అంతా కూడా మరో లెవల్ అనిపించేలా ఉంది. ‘శీలో రక్షతి రక్షిత:’ అనే వెరైటీ క్యాప్షన్ చూస్తేనే నవ్వొచ్చేస్తోంది. దానికి తగ్గట్టే సినిమా మొత్తం కంప్లీట్ సంపూ మార్క్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఈ నెల క్యాలీఫ్లవర్ థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. అందరి హీరోల డైలాగ్స్‌ను తన సినిమా సీన్స్‌లో పేరడీ చేసి కడుపుబ్బా నవ్వించడమే కాదు ఆ హీరోల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు సంపూ. ఈ హీరోకు ఇంకా మంచి సపోర్ట్ దొరికితే పెద్ద హీరోలు తమ సినిమాలలో అవకాశాలిస్తే సంపూర్ణేశ్ బాబు మరో రేంజ్ కి వెళతాడనడంలో సందేమే లేదు.































