టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగతా సినిమా ఇండస్ట్రీలలోనూ నట వారసులు వచ్చి సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. హీరోల కొడుకులు హీరోలు మాత్రమే కాకుండా దర్శక, నిర్మాతల కొడుకులు కూడా హీరోలుగా వచ్చి స్టార్ స్టేట్స్‌ను దక్కించుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు కొడుకు రానా ఆయన తమ్ముడు, అలాగే ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్, తాజాగా దిల్ రాజు ఫ్యామిలీ నుంచి కూడా ఓ హీరో వచ్చాడు. రౌడీ బాయ్స్ అనే పేరుతో ఈ సినిమా రూపొందించారు.

అయితే ఇండస్ట్రీలో సత్తా చాటాలంటే బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఉంటే సరిపోదు. సొంత తెలివి తేటలు టాలెంట్ అలాగే నటన మీద ఆసక్తి ఉండాలి. అయితేనే ఇప్పుడున్న యంగ్ అండ్ స్టార్ హీరోలను తట్టుకొని నిలబడగలుగుతారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలలోనే ఉన్నాడు ప్రముఖ దర్శకుడు శోభన్ తనయుడు సంతష్ శోభన్. శోభన్ 1989లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ‘రౌడీయిజం’ అనే సినిమాకు కొన్ని రోజుల పనిచేశాక ఆ సినిమా కొన్ని కారణాల వలన 10 రోజులకు ఆగిపోయింది. ఆ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర ‘అనగనగా ఒక రోజు’ అనే సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు.

వర్మతోనే ప్రేమకథ, దావూద్ అనే సినిమాలకు పనిచేశాడు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం, మురారి సినిమాలకు రచయితగా పనిచేశారు. ఇక క్షణ క్షణం, ఒక రాజు ఒక రాణి అనే సినిమాల్లో కూడా శోభన్ నటించారు. మురారి సినిమా సమయంలో మహేష్ బాబుతో మంచి పరిచయం ఏర్పడింది. దాంతో ఆయన హీరోగా బాబీ సినిమాను తెరకెక్కిస్తూ టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఈ సినిమా ఫ్లాపయినా ఎం.ఎస్.రాజు నిర్మించిన వర్షం సినిమాకి అవకాశం అందుకున్నారు. ప్రభాస్, త్రిష హీరో జంటగా నటించిన వర్షం సినిమా భారీ హిట్ అందుకొని దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత రవితేజ, ఛార్మి, అంజలి నటించిన చంటి సినిమా రూపొందించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దర్శకుడిగా కూడా శోభన్ చివరి సినిమా అదే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావుకు అత్యంత సన్నిహితంగా ఉండే శోభన్ మరణించాక ఆయన వారసుడిగా సంతోశ్ శోభన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య వచ్చిన ఏక్ మినీ కథతో మంచి హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో మాటలో ప్రవర్తనలో ఇండస్ట్రీ వర్గాలకి తండ్రిని గుర్తు చేస్తున్నాడు.

అంతేకాదు మంచి ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలను అందుకున్నాడు సంతోష్ శోభన్, దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా శోభన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు కూడా అలాగే నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడీ యంగ్ హీరో చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయట. ఈ సినిమాలు హిట్ అయి ఎవరూ తొక్కేయకపోతే మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడని చెప్పుకుంటున్నారు.



























