సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు. కానీ.., ఈ రంగుల లోకంలో ఎవరి స్థానం అయినా.., సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇలా సూపర్ సక్సెస్ అయ్యి కూడా.. తరువాత కాలంలో సరైన విజయాలను అందుకోలేక.., తెరమరుగు అయిపోయిన స్టార్స్ ఎవ్వరో ఇప్పుడు చూద్దాం.

ఏ ఇండస్ట్రీలో అయినా.., ఒక హీరోకి లవర్ బాయ్ ఇమేజ్ రావడం అంత సులభం కాదు. కానీ.., హీరో తరుణ్ కి అతి తక్కువ కాలంలోనే లవర్ బాయ్ గా మంచి క్రేజ్ దక్కింది.

బాలనటుడిగానే సంచలనాలు సృష్టించిన తరుణ్ పెద్దయ్యాక ‘నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలతో స్టార్ అయిపోయాడు. కానీ.., తరువాత కాలంలో వరుసగా వచ్చిన ఫ్లాప్స్ తరుణ్ కెరీర్ ని దెబ్బ తీశాయి.

ఇక ఈ లిస్ట్ లో తప్పక చెప్పుకోవాల్సిన హీరో వేణు తొట్టెంపూడి. 90 చివరలలో వేణు వరుస విజయాలను అందుకున్నాడు. తరువాత కాలంలో హిట్స్ పడక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు. కానీ.., ఇప్పుడు వేణు చాలా వరకు సినిమాలకి దూరం అయిపోయారు.

చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాతో వరుణ్ స్టార్ అయ్యాడు. కానీ.., తరువాత వరుస పరాజయాలు. మార్కెట్ పడిపోయింది. చివరికి బిగ్ బాస్ లో కూడా మెరిశాడు వరుణ్ సందేశ్. అయినా.., ఇప్పటికీ వరుణ్ కి అవకాశాలు రావడం లేదు.

ఇక బాగా హైలెట్ అయ్యి.., విజయాలను అందుకోలేక పడిపోయిన మరో స్టార్ నవదీప్. చందమామ, గౌతమ్ SSC లాంటి సినిమాలు బాగా ఆడినా ఈ హీరోకి సరైన అవకాశాలు అందలేదు. దీనితో.., ప్రస్తుతం నవదీప్ టీవీ షోలతో బిజీగా ఉన్నాడు.

ఒక్కోసారి ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకున్న స్టార్స్.. ఒక్కసారిగా వెనకపడిపోతుంటారు. అలా ట్రాక్ తప్పిన స్టార్ రాజ్ తరుణ్. హ్యాట్రిక్ సక్సెస్ లతో ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. కట్ చేస్తే ఇప్పుడు ఒక్క హిట్ కూడా రావడం లేదు. చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు.

మీకు హీరో రోహిత్ గుర్తున్నారా? 6 టీన్స్ సినిమాతో 90ల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత రోహిత్ చాలా సినిమాల్లో నటించాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవితో కూడా కలిసి నటించాడు రోహిత్. కానీ.., రోహిత్ ఖాతాలో ఒక్క మాస్ హిట్ కూడా లేదు. దీనితో రోహిత్ పూర్తిగా సినిమాలకి దూరం అయ్యాడు.

చిన్న చిన్న హీరోలు మాత్రమే కాదు .., వడ్డే నవీన్ లాంటి స్టార్ కూడా హిట్ సినిమాలు లేకనే పరిశ్రమకి దూరం అయ్యాడు. అప్పట్లో నవీన్ కి ఉండిన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

బాల నటుడిగా పరిశ్రమలో సూపర్ సక్సెస్ అయ్యాడు తనీష్. తరువాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అయినా.., మంచి అవకాశాలను అయితే అందుకోలేకపోయాడు. చివరికి బిగ్ బాస్ లో మెరిసిన తనీష్ తలరాత మాత్రం మారలేదు.

నటన పరంగా శివ బాలాజీకి అందరూ 100కి 100 శాతం మార్కులు వేశారు. కానీ.., ఆయనకి మాత్రం ఇండస్ట్రీ లాంగ్ రన్ లేకుండా పోయింది. ఆఖరికి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినా శివ బాలాజీకి మళ్ళీ అవకాశాలు రాకపోవడం బాధాకరం.

ఇక ఒకప్పటి స్టార్ హీరో రాజా కూడా ఈ లిస్ట్ లోకే వస్తాడు. ఆయన చేతిలో కొన్ని అవకాశాలు ఉండగానే పరిశ్రమలో ఇబ్బందులను తట్టుకోలేక బయటకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పాస్టర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.































