పరిచయం అవసరం లేని పేరు కన్నడ ప్రభాకర్. తెలుగు సినిమాల్లో దాదాపు దశాబ్దకాలం పాటు ప్రతి కథానాయకుడి పాత్రలో ఆయన కనిపించారు. జ్వాల, కిరాతకుడు, రాక్షసుడు, పసివాడి ప్రాణం, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరిలాంటి చిత్రాల్లో టైగర్ ప్రభాకర్ నటించారు. ఆయన మాతృభాష కన్నడంలో సహజమైన పులితో ఫైట్ చేయడంతో టైగర్ ప్రభాకర్ అనే పేరుతో గుర్తింపు పొందారు. ఈయన మొదటగా అల్ఫోంజను వివాహం చేసుకున్నారు. వీరికి గీతా, భారతి, కూతుర్లతో పాటు వినోద్ అనే కొడుకు కూడా ఉన్నారు.

ఆ తర్వాత ప్రముఖ కన్నడ నటి జయమాలను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి సౌందర్యకు జన్మనిచ్చారు. కొన్ని అనివార్య కారణాల వలన ఇద్దరూ వైవాహికంగా విడిపోయారు. తరువాత కన్నడ ప్రభాకర్ ‘మంజు’ అనే మరో నటిని వివాహం చేసుకున్నారు. మీరిద్దరూ కలిసి అర్జున్ కి జన్మనిచ్చారు.
అయితే కన్నడ ప్రభాకర్ రెండో భార్య ‘జయమాల’ కర్ణాటకలోని దక్షిణ జిల్లాలో జన్మించారు. జయమాల ‘తులు’ మాట్లాడే ఓమయ్య, కమలమ్మ అనే దంపతులకు జన్మించారు. అయితే జయమాల ‘తులు’ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. హీరోయిన్ జయమాల తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, అనంత్ నాగ్, కన్నడ ప్రభాకర్, చిరంజీవి లాంటి హీరోలతో ఆమె నటించారు.

టైగర్ ప్రభాకర్ తో విడాకుల అనంతరం జయమాల ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ అయినా రామచంద్రన్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కన్నడ ఫిలిం ఛాంబర్ అధ్యక్షురాలిగా కొనసాగారు. అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్సీ గా ఎన్నికఅయ్యారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖ మాత్యులుగా కొనసాగారు. జయమాల కర్ణాటకలోని గ్రామీణ మహిళా పునరావాసం అనే అంశంపై అనేక పరిశోధనలు చేసి చివరికి దానిపై ఒక సిద్ధాంతవ్యాసం రాశారు. అందుకుగాను 2008 బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఏపిజె.అబ్దుల్ కలాం చేతుల మీదుగా డాక్టరేట్ ను అందుకున్నారు.

ఈమె 1979లో ‘అర్జునగర్వభంగం’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత భామరుక్మిణి చిత్రంలో నటించారు. 1980 నాటి స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవితో ‘రాక్షసుడు’ చిత్రంలో జయమాల నటించారు. ఈ చిత్రంలో ఇళయరాజా స్వరపరచిన “నీ మీద నాకు అమమ్మో.. అందంనే దాచలేను ఓయబ్బో.. అనే పాటతో జయమాల ఆ రోజుల్లో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత జయమాల తిరిగి ఏ తెలుగు సినిమాలో నటించలేదు.

































