కంటెంట్ బావుండాలంతే.. ఎక్కడ రిలీజ్ చేసిన ఆదరిస్తారనడానికి వెంకీనే ఎగ్జాంపుల్..

0
345

సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్..సినిమా చూడాలంటే ఈ రెండింట్లోనే అనే పద్దతి ఎప్పుడో పోయింది. ఇప్పుడు ట్యాబ్స్, మొబైల్స్ లాంటి వాటిలోను మనకు కావాల్సిన సినిమాను చూసేయొచ్చు. అదే ఇప్పుడు చాలా సినిమాల సక్సెస్‌కు ప్రధాన కారణం అవుతోంది. ఒకప్పుడు సిల్వర్ స్క్రిన్ మీద రిలీజైన సినిమాను చూడాలంటే కనీసం ఓ సంవత్సరం తర్వాతే అని ఉండేది. అప్పుడు బ్లాక్ బస్టర్ అని టాక్ తెచ్చుకున్న సినిమాలు థియేటర్స్‌లోనే 100 రోజులు..150 రోజులు..175 రోజులు..200 రోజులు..225 రోజులు అంటూ ప్రదర్శింపబడుతుండేవి.

ఆ తర్వాత కొన్నాళ్ళకు గానీ ఇదే సినిమా మళ్ళీ స్మాల్ స్క్రీన్ మీద ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుండేవారు. అలా వచ్చిన సినిమాలకు మంచి టీఆర్పీ రేటింగ్ నమోదయ్యేది. ఇప్పుడు అలాకాదు సినిమా ఒక్క షోతోనే హిట్టా..ఫ్లాపా అని డిసైడ్ చేసేస్తున్నారు. అందుకే ఒక్కో సినిమాను మరో సినిమా పోటీ లేకుండా చూసుకొని భారీ సంఖ్యలో థియేటర్స్ లో రిలీజ్ చేసి వారం నుంచి రెండు వారాలలోపే లాభాలు దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఓ సినిమాను థియేటర్స్‌లో ఉన్నంతవరకే చూడగలము.

ఎత్తేశాక ఇక బుల్లితెరపై వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని ఎప్పుడు కావాల్సివస్తే అప్పుడు చూడొచ్చు. ఈ సౌలభ్యమే కొన్ని సినిమాలకు మంచి ఆదరణ దక్కేలా చేస్తుంది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుడు ఓటీటీలో చూస్తున్నామా అని ఆలోచించడు. సినిమా చూస్తున్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. అందుకు ఉదాహరణ వెంకటేశ్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. పెద్ద నిర్మాత, డిస్త్రిబ్యూటర్ అయి ఉండి కూడా అగ్ర నిర్మాత సురేశ్ బాబు థియేటర్స్ లో రిలీజ్ కాకుండా వెంకీ సినిమాలను ఓటీటీలో తీసుకువచ్చి హిట్ అందుకున్నారు.

ఇంతక ముందు తమిళ హిట్ సినిమా అసురన్ తెలుగు రీమేక్ నారప్ప చిత్రం రూపొందించారు. ఈ సినిమాలో వెంకటేశ్ – ప్రియమణి జంటగా నటించారు. తమిళ సినిమా రీమేక్ అనే భావన లేకుండా నారప్ప చిత్రాన్నీ చూసి ప్రేక్షకులు బాగా ఆదరించారు. తాజాగా వచ్చిన దృశ్యం 2 సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. మలయాళ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతక ముందు కోలీవుడ్ స్టార్ హిరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, ఇటీవల వచ్చిన జై భీమ్ లాంటి సినిమాలు ఇలా ఓటీటీలో వచ్చి హిట్ టాక్ తెచ్చుకొని భారీ లాభాలను తెచ్చినవే.

దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకుడి మైండ్ సెట్ పూర్తిగా మారిందని చెప్పవచ్చు. దర్శక నిర్మాతలు ఇచ్చే ఎంటర్‌టైన్మెంట్ బావుంటే సగటు ప్రేక్షకుడు కూడా సినిమా చూసేందుకు బాగా ఉత్సాహం చూపిస్తారు. చిన్న స్క్రీన్ మీద సినిమా చూస్తున్నామా పెద్ద స్క్రీన్ మీదా చూస్తున్నామా అని ఎవరూ పట్టించుకోరు. ఇలా కూర్చోబెట్టాలంటే కథలో దమ్ముండాలి. దాన్నీ జనాలు నచ్చేలా మెచ్చేలా తీయాలి. ఎలాంటి ప్రేక్షకుడైనా సినిమాను ఆదరించక మానడు. ఇదే విషయాన్ని వెంకటేశ్ తన తాజా చిత్రం దృశ్యం 2తో ద్వారా నిరూపించాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here