నాగార్జున, అమల పెళ్లి వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

0
8923

అక్కినేని నాగార్జున.. టాలీవుడ్ లో తనకంటూ సపరేట్ క్రేజ్ సంపాదించుకున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఆయన టాలీవుడ్ లో స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ నాగార్జున యంగ్ కుర్రాడిలా కనిపిస్తుంటారు. ఆయన ఫిట్ నెస్ రహస్యం అయితే ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్.. ఇద్దరూ ఆయనకు తమ్ముళ్లలా కనిపిస్తారు. అందుకే.. టాలీవుడ్ లో ఇప్పటికీ నాగార్జునకు క్రేజ్ తగ్గలేదు. స్టార్ హీరోగా ఇప్పటికీ కొనసాగుతూనే.. టీవీ షోలలో కూడా ఈ మధ్య హోస్టింగ్ చేస్తున్నారు నాగార్జున. ఇక.. అక్కినేని ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో ఎంత పేరుందో అందరికీ తెలుసు.

అక్కినేని నాగేశ్వరరావు దగ్గర్నుంచి.. ఇప్పటి తరం నాగ చైతన్య, అఖిల్ వరకు.. అందరూ సినిమా ఇండస్ట్రీలోనే హీరోలుగా చలామణి అవుతున్నారు. నాగార్జున కూడా అక్కినేని నాగేశ్వరరావు వారుసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. నాగార్జున ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

తండ్రి మాటను ఏనాడూ జవదాటని నాగార్జున

అయితే.. నాగార్జున కూడా ఏనాడూ తండ్రి మాటను జవదాటలేదు. నాగేశ్వరరావు చెప్పినట్టుగానే సినిమాల్లోకి వచ్చి సెటిల్ అయ్యారు. టాప్ హీరో అయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ తో ఈక్వల్ గా స్టార్ హీరోగా సూపర్ డూపర్ సినిమాల్లో నటించారు. నాగార్జునకు సరైన టైమ్ లో బ్రేక్ ఇచ్చిన సినిమా శివ. ఆ సినిమా తర్వాత ఇక నాగార్జున వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.

తన పెళ్లి విషయంలో మాత్రం తండ్రి మాటను కాదన్న నాగార్జున

నాగార్జునకు ముందే పెళ్లి అయినా.. కొంతకాలం తర్వాత విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున.. అప్పట్లో హీరోయిన్ గా ఉన్న అమలను ప్రేమించారు. వీళ్లిద్దరూ కలిసి అప్పుడు చాలా సినిమాల్లోనే నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తాను అమలను ప్రేమిస్తున్నానని.. తననే పెళ్లి చేసుకుంటానని నాగార్జున.. తన తండ్రి నాగేశ్వరరావుకు చెప్పినా.. నాగేశ్వరరావు అప్పుడు ఒప్పుకోలేదట. ప్రేమ పెళ్లి వద్దన్నారట. కానీ.. తండ్రి మాటను నాగార్జున ఈ విషయంలో వినకుండా.. అమలనే పెళ్లి చేసుకున్నారట.

నాగేశ్వరరావుకు నచ్చజెప్పిన మురళీ మోహన్

నాగార్జున.. అమలను పెళ్లి చేసుకున్నాక.. కొంతకాలం వరకు తన తండ్రితో మాట్లాడలేదట. తండ్రితో విభేదాలు కూడా వచ్చాయట. అయితే.. తండ్రి కొడుకులు ఈ విషయంలో బేషజాలకు పోవద్దని.. తన ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకున్నాక.. ఇందులో రాద్ధాంతం ఎందుకని.. నాగేశ్వరరావుకు.. నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అయిన మురళీ మోహన్ నచ్చజెప్పారట. కొడుకును దూరం చేసుకోవద్దని.. అందరూ కలిసి ఉండాలని ఆయన హితువు పలికారట. దీంతో నాగేశ్వరరావు.. కొడుకు నాగార్జున, కోడలు అమలను దగ్గరికి తీశారట. అప్పుడే అమలను తమ ఇండి కోడలిగా నాగేశ్వరరావు అంగీకరించారట. ఆ తర్వాత నుంచి అక్కినేని ఫ్యామిలీలో పెద్దగా మనస్పర్థలు వచ్చిన దాఖలాలు అయితే లేవు. అలా.. అమల అక్కినేని వారింట్లో అడుగు పెట్టిందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here