కళ్ళెదుటే భర్త రైలు కింద పడిపోవడంతో సర్వస్వం కోల్పోయిన మధురగాయని జిక్కి.!

0
687

పి. జి. కృష్ణ వేణి అంటే ఎవరికి తెలియదు. అదే గాయని జిక్కి అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంత మధురమైన కంఠం కలిగిన ఆవిడ దక్షిణ భారత దేశ ప్రజల కోసం ఎన్నో మధురమైన పాటలను అందించిన ఆ తర్వాత కాలంలో కనపడకుండా వెళ్ళిపోయింది ఆ గాయని. 2001 సంవత్సరంలో విడుదలైన మురారి సినిమా లో అలనాటి బాలచంద్రుడు అనే పాట తిరిగి చిత్రసీమను తన స్వరంతో పలకరించింది. ఆ పాట పాడిన తర్వాత ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్ ఇంత కాలం ఇంత మంచి స్వరాన్ని ఎలా మిస్ అయ్యానని తేరుకునే లోపలే ఆవిడ లోకం నుంచి వెళ్ళిపోయింది. జిక్కి చిత్తూరు జిల్లాకు చెందిన కుటుంబం బ్రతుకు తెరువు కోసం చెన్నై పట్టణానికి చేరుకుంది.

ఈవిడ నవంబర్ 3, 1937 చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి లో జన్మించింది. ఈవిడ చదువు కంటే ఆట, పాట మీద ఎక్కువ శ్రద్ధ కనబరిచేది. అయితే ఆమె బంధువుల్లో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కంపోజర్ గా పని చేయడం ద్వారా ఆమెకు కాస్త కలిసి వచ్చింది. అయితే ఈవిడ ఎలాంటి శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. అయితే ఈవిడ సినిమారంగంలోకి మొదటగా గాయనిగానే కాకుండా నటిగా ప్రవేశించింది. మొదటగా ఈమె పంతులమ్మ సినిమాలో బాలనటిగా వెండితెరకు పరిచయం అయింది. అలా 1983 సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసిన ఆవిడ ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఒక తమిళ సినిమాలో మొదటి పాటను పాడారు. అలా ఆ తర్వాత 1978 లో విడుదలైన జ్ఞాన సుందరి అనే సినిమాలో ఆవిడ పాడిన పాట సూపర్ హిట్ గా కావడంతో నాటి సంగీత దర్శకుల అందరి దృష్టి ఆమెపై పడింది. దీంతో ఇక అక్కడి నుంచి ఆమె తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 1950 సంవత్సరంలో సినీ గాయని ప్రపంచంలో జిక్కిగా పేరు మార్చుకున్నారు. ఇక ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి రాజా తో కలిసి మొట్టమొదటిసారిగా ఓ డ్యూయెట్ పాడారు. ఆ తర్వాత మూడేళ్లపాటు మ్యూజిక్ స్టూడియో, అలాగే బయట కూడా సాగిన వారి ప్రేమ ప్రయాణం చివరికి పెళ్లితో ముగిసింది. జిక్కి భర్త రాజా షావుకారు, విప్రనారాయణ సినిమాలో పాటలు పాడారు.

ఆ తర్వాత ఒకవైపు రాజా – జిక్కి, మరోవైపు ఘంటసాల – జిక్కి జంటగా ఎన్నో భద్రాద్రి గీతాలను మనకు వారు అందించారు. ఇక 1950 దశకంలో జిక్కి తిరుగులేకుండా పోయింది. దక్షిణాన ఉన్న అన్ని భాషల్లో ఆమె టాప్ గాయనిగా నిలబడింది. హిందీ లో తొలిసారిగా పాటలు పాడిన గాయనీగాయకులు రాజా – జిక్కి లే. అలా వారి తిరుగులేని గాయక ప్రస్థానంలో రాను రాను కొన్ని ఆటంకాలు మొదలయ్యాయి. జిక్కి గారికి రెండు వైపుల నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. మొదటగా తన కెరీర్ పరంగా చూస్తే గానకోకిల సుశీల రంగప్రవేశం చేయగా మరోవైపు ఈ సంసార జీవితంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులు.ఇక అసలు విషయంలోకి వెళితే జిక్కి భర్త రాజా కాస్త మూడీ మనిషి ఆయన నలుగురితో కలిసి ఎక్కువ కలిసేవాడు కాదు తన మీద గట్టి నమ్మకం కలవారు. ఆయన సంగీత దర్శకులు మార్పులను అంగీకరించేవారు కాదు. అలా రాజా ఆయన స్టైల్ లోనే తప్పించి వేరే వారిని ఎవరిని అనుకరించేవారు కాదు.

అయితే ఆయన మొండి వాదనతో క్రమంగా ఆయనకు సినిమాలలో పాటలు పాడే అవకాశం క్రమంగా తగ్గిపోయాయి. ఆయనతో పాటు ఆయన భార్య కి కూడా పాటలు పాడే అవకాశం లేకుండా పోయాయి. ఇందులో భాగంగానే భర్త రాజా ను భార్య మార్చే ప్రయత్నం చేసిన చివరికి ఆయన మాత్రం జిక్కి ని తనతో ఇకపై కలిసి పాడొద్దు అని చెప్పేశాడు. పెళ్లి తర్వాత జిక్కి తన భర్తకు ఇచ్చిన మాట ప్రకారం కొంత కాలం పాటు సినీ రంగానికి ఆవిడ దూరంగా ఉండిపోయారు. దీంతో ఆవిడ తర్వాత పాటలు పాడాలి అనుకున్న అవకాశాలు పూర్తిగా తగ్గి పోయాయి. ఈ విధంగా భర్త తరపున కూడా జిక్కి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా పాటలు అవకాశం తగ్గినా కొంతకాలం రాజా కు ఉన్న టూరిస్ట్ కార్ల వ్యాపారంలో వారు సమయానికి దానితోపాటే అక్కడ అప్పుడప్పుడు కచేరీలు చేయడం ప్రారంభించారు. అయితే కార్ల వ్యాపారంలో నష్టం ఎక్కువవడంతో వారు కచేరీలతో ఎక్కువగా ఆధారపడ్డారు.

ఇలా దక్షిణాది భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో పాటలు పాడిన ఎన్నో రాష్ట్రాల నుంచి అవకాశాలు బాగానే వచ్చే కాకపోతే సంసారజీవితంలో పుట్టిన ఆరుగురు పిల్లలు వల్ల కుటుంబపరంగా పోషణ భారంగా మారింది. అయితే ఆ తర్వాత దురదృష్టం వెంటాడడంతో కచేరీల కోసం రైలు ప్రయాణం చేస్తుండగా ఓ స్టేషన్ ప్లాట్ ఫామ్ పై దిగిన రాజా రైలు బయలుదేరుతున్న విషయం గమనించి తొందరలో రైల్వే ఎక్కబోయి ఆ సమయంలో కాలుజారి రైలు కింద పడి పోయారు. దీంతో ఆయన రైలు కింద పడి ముక్కలయ్యి అక్కడికక్కడే మరణించారు. ఇలా కళ్లెదుట జరిగిన ప్రమాదాన్ని జిక్కీ చేరుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత ఆ షాక్ నుండి తేరుకుని పిల్లల కోసం తాను ఎలాగైనా బతకాలి అన్న నిర్ణయానికి వచ్చారు జిక్కి. అయితే ఆ సమయంలో జిక్కీకి నైతిక మద్దతుగా నిలిచింది ఆవిడ పాటలు పాడే సమయం లో మరో గాయని జమునారాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here