యూట్యూబ్ లో దేత్తడి హారిక గా మిలియన్స్ ఫాన్స్ ని సంపాదించుకున్న హారిక గురించి సోషల్ మీడియాలో అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రస్టేటెడ్ స్టూడెంట్, మదర్, ఇంటి ఓనర్ ఇలా రకరకాల క్యారెక్టర్లు చేస్తూ గుక్క తిప్పుకోకుండా తెలంగాణ యాసలో అదరగొట్టే దేత్తడి హారిక బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ రచ్చ రచ్చ చేస్తుంది. ముట్టుకుంటే కసక్ మని తెగిపోవాల్సిందే. అంతవాడిగా ఉన్న మెంటాలిటీ హారికది. బోల్డ్ & బ్యూటీనెస్ ఓవర్ లోడెడ్. తప్పు చేసినా కవర్ చేసుకునే రకం. పరిస్థితులను ఎలాగోలా తనకు అనుకూలంగా మల్చుకునే టైపు. హైట్ చిన్నదే అయినా.. ఆమె చూపులో ఉన్న చురుకు.. మేని అందంలోనూ ఉంది.

ఫస్ట్ ఎపిసోడ్ లోనే దేత్తడి పోషమ్మ గుడి… ఏదైతే అదైంది.. అన్నట్లుగా తన ఔట్ ఫిట్ తో ఓ ముద్రేసిపోయింది. స్క్రీన్ పై హారిక కనిపిస్తే చాలు.. కళ్లప్పగించి చూసే కుర్రకారు పెరిగిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. విశేషమేమిటంటే.. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా లో కూడా నటించలేదు హారిక. కానీ., కోలీవుడ్ లో మూడేళ్ల క్రితం విడుదలైన అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ లో నటించింది. అర్జున్ రెడ్డి డాక్టర్ అయిన తర్వాత హాస్పిటల్ లో ఇద్దరు నర్స్ లు అర్జున్ రెడ్డి కి అసిస్ట్ చేస్తారు. గుర్తుందా? ఆ ఇద్దరూ నర్స్ లలో ఒక నర్స్ పాత్రను తెలుగులో లహరీ షారీ పోషించగా, తమిళ్ లో ఆ పాత్ర లో అలేఖ్య హారిక కనిపించారు. అలా అలేఖ్య హారిక తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పరిచయమైంది. తన అసలు పేరు అలేఖ్య హారిక అయినా కూడా ముద్దుపేరు మాత్రం దేత్తడి హారికనే.

యూ ట్యూబ్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాకముందు అమెజాన్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న ఉద్యోగం చేసిన హారిక కొన్ని నెలలు తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి యూట్యూబ్‌కే పరిమితమైపోయింది. ఆమధ్య కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అంతేకాకుండా అప్పుడప్పుడూ కవర్ సాంగ్స్ కూడా చేస్తూ.. డాన్స్‌ల్లో కూడా దుమ్ము దులిపేస్తూ.. మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. లేటెస్ట్ గా బిగ్ బాస్ 4 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దేత్తడి హారిక రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది.

భవిష్యత్తులో తన కెరీర్‌కు ఇది బాగా ప్లస్ అవుతుందని హారిక స్ట్రాంగ్ గానే నమ్ముతుంది. అందుకే బిగ్ బాస్ 4లో అదిరిపోయే అందాల ఆరబోత చేస్తూ గ్లామర్ షోతో దుమ్ము దులిపేస్తుంది హారిక. ఈమె జోరును చూస్తుంటే ఈ దేత్తడి పాప కెరీర్ సరైన దారిలోనే వెళ్తుందనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here