ఒక్క ఫ్లాప్ అయినా ఇవ్వు దేవుడా అని కోరుకున్న దర్శకుడెవరో తెలుసా..?

0
1633

నెల్లూరు జిల్లాకు సరిగ్గా 16 కిలోమీటర్ల దూరంలో మైపాడు లో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు తన స్నేహితులు అందరూ అచ్చు నువ్వు శోభన్ బాబులా ఉన్నావ్ అనడంతో ఎలాగైనా హీరో కావాలని చెన్నై కి వచ్చాడు. చెన్నై వీధుల్లో తిరుగుతున్నప్పుడు జగపతి ఆర్ట్ పిక్చర్స్, జెమిని స్టూడియో, వాహిని స్టూడియో చూస్తూ వాటిలో కి వెళ్లడానికి ప్రయత్నించేవాడు. కానీ అందులోకిఅనుమతి ససేమిరా దొరికేది కాదు.

చేతి రాత తన తలరాతనే మార్చేసింది. ఈ కుర్రాడి చేతి రాత బాగుండడంతో దర్శకుడు మధుసూదన్ రావు దగ్గర దాదాపు పది సంవత్సరాల కాలం పాటు అనగా 1979 వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగాడు.తాను జీవితకాలం అసిస్టెంట్ డైరెక్టర్ గానే కొనసాగుతానేమో అని తీవ్ర నిరాశకు గురయ్యాడు. కానీ ఆయనకు ఎక్కడో సుడి ఉండడంతో కె.ఎస్.రామారావు నిర్మాత రూపంలో కోదండరామి రెడ్డి వెతుక్కుంటూ రావడం జరిగింది.

1980లో వచ్చిన సంధ్యా చిత్రం ఎన్నో బాలారిష్టాలను దాటి కె.ఎస్.రామారావు సహాయ సహకారాలతో ఎట్టకేలకు సినిమా విడుదలై విజయవంతం అయింది. ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ మరో అవకాశాన్ని కోదండరామిరెడ్డి కి న్యాయం కావాలి సినిమా రూపంలో ఇవ్వడం జరిగింది.అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

కిరాయి రౌడీలు,ప్రళయ రుద్రుడు,ప్రేమ మూర్తులు, అభిలాష, చాలెంజ్, కిరాయి కోటిగాడు వంటి హిట్ సినిమాల తర్వాత కోదండరామిరెడ్డి స్టామినాను పెంచే మరో ఇండస్ట్రి హిట్ ఖైదీ సినిమా అటు చిరంజీవికి ఇటు కోదండరామ్ రెడ్డి కి విపరీతమైన మాస్ ఇమేజ్ ప్రేక్షకుల్లో తీసుకొచ్చింది. శ్రీరంగనీతులు,భార్గవ రాముడు,భలే దొంగ,దొంగ మొగుడు,పసివాడి ప్రాణం,అత్తకి యముడు అమ్మాయికి మొగుడు,కంచు కాగడా,కోడెత్రాచు,నారి నారి నడుమ మురారి వంటి హిట్ సినిమాల సమయంలో సినీ నిర్మాతలు కోదండరామిరెడ్డి ఇంటికి క్యూ కట్టడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో దేవుడా దయచేసి నాకు ఓ ఫ్లాప్ సినిమా ఇవ్వండని అప్పుడే ఆకాశంలో కాకుండా నేలపై నడుస్తానని ఆ దేవున్ని వేడుకున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here