KGF real or fake : కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన రోజునుండి ఇప్పటివరకు వసూళ్లలో ఏ మాత్రమే తగ్గడం లేదు కేజీఎఫ్ 1 సినిమా 2018లో అంచనాలు లేకుండా విడుదలయినా సంచలనం సృష్టించింది. ఇక ఇపుడు 4 ఏళ్ల తర్వాత విడుదలైన కేజీఎఫ్ 2 కేజీఎఫ్ 1 కంటే అధిక వసూళ్లను అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఫిదా చేసింది . కేజీఎఫ్ కథ కర్ణాటక లోని కోలార్ గనుల్లో బంగారం మైనింగ్ నేపథ్యంలో ఆధిపత్యం కోసం జరిగే కథగా వచ్చింది .

అసలు కోలార్ గనుల్లో జరిగిందేమిటి….
కోలార్ నగరానికి 30 కి.మీ, బెంగళూరుకు 100 కి.మీ దూరంలో ఉన్నాయి. సుమారు 100 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలో బంగారం తవ్వకాలు జరిగినట్లు చరిత్ర మాట. 2001 నుండి ఇక్కడ తవ్వకాలు నిలిపేశారు. టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ తో యుద్ధంలో ఓడిపోయి మరణించాక బ్రిటిషర్స్ చేతిలోకి మైసూర్ సంస్థానం వెళ్ళిపోయింది. బ్రిటిష్ గవర్నర్ జాన్ వారెన్, కోలార్ ప్రాంతం మట్టిలో బంగారం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఓ పుసక్తంలో రాసుకొచ్చారు. అక్కడ బంగారాన్ని వెలికి తీయాలని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తుల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టాడు.ఆశించినంతగా బంగారం దొరకకపోవడంతో మైనింగ్ ఆపేసారు.
అయితే 1850 తర్వాత వారెన్ రాసిన పుస్తకాన్ని లావెల్లీ అనే బ్రిటిష్ అధికారి చదివి బంగారు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించాడు. కొన్ని రోజులకు జాన్ టేలర్ కంపెనీ చొరవతో కోలార్‌లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తవ్వకాలకు అవసరమైన విద్యుత్ కోసం ఓ భారీ పవర్ ప్లాంట్‌ను కూడా అక్కడ నిర్మించారు.30,000 మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. 2001 వరకు అక్కడ తవ్వకాలు జరిగాయి. ఇక అక్కడ బంగారం అంతరించిపోయిందని మైనింగ్ ఆపేసారు. కేజీఎఫ్ లో చూపినట్టే బంగారం మైనింగ్ జరుగుతుందా అని ఇంజనీర్ కేఎస్ రావు గారిని అడుగగా… రీల్‌లో చూసిందంతా రియల్ కేజీఎఫ్ కాదు. సినిమా పరంగా వాళ్లు చక్కగా తీర్చిదిద్దారు. మూవీ హిట్ అయింది. చాలా చోట్ల రెండు మూడు కిలో మీటర్ల దూరంలో మైన్స్ తవ్వి కిందకు వెళ్లి బంగారం తీస్తారు. సినిమాలో అలా చూపించలేదు అని ఆయన అన్నారు.

































