సినిమా స్టూడియోల చుట్టూ చెప్పులరిగేలా, బట్టలు చినిగేలా తిరిగిన సినిమా ఛాన్స్ రాని నటులు కొంతమందైతే సినిమాలు వద్దు అన్న కూడా తమ వెంటపడి దర్శకనిర్మాతలు బుక్ చేసుకున్న సందర్భాలున్నాయి. కొంతమందికి అదృష్టం అందలం ఎక్కిస్తానంటే.. బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. మన తెలుగింటి గుంటూరు అమ్మాయి అభిలాషకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది.

1978 లో కె.బాలచందర్ గారు తెలుగులో ఓ సినిమా తీయ తలుచుకున్నారు. ఆ సందర్భంలో బాలచందర్ సినిమాలకు పనిచేసే రచయిత గణేష్ పాత్రో తన స్నేహితుడిని కలవడానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కూతురైన అభిలాష ను చూడడం జరిగింది. ఆ అమ్మాయి స్కూల్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. గణేష్ పాత్రో తన స్నేహితుడితో బాలచందర్ తెలుగులో ఓ సినిమా తీయబోతున్నారు కావున మీ అమ్మాయిని ఆ సినిమాలో హీరోయిన్ గా చేయిస్తే ఎలా ఉంటుందని తన స్నేహితుడిని అడగగా.. ఆయన తిరిగి తన కూతురితో విషయం చెప్పాడు.

సినిమా ఆడిషన్స్ కి హాజరైన అభిలాష ను దర్శకుడు బాలచందర్ ఒక పాట పాడమని అడగగానే ఆమె సిగ్గుపడుతూ, భయపడుతూ, బెరుకుగా ఓ పాట మొదలు పెట్టింది. ఆమె ఏకంగా ఫ్లోర్ ను పార్కు లాగా ఊహించుకొని పొర్లుదండాలు పెట్టింది. అలా దాదాపు 160 మంది అమ్మాయిల తర్వాత ఈ అభిలాష మరో చరిత్ర మూవీ కి ఎంపికయ్యారు. సినిమా నేపథ్యం మొత్తం విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.

అయితే అభిలాష అనే పేరును తమిళ ప్రజలు అభిలాస అని పలుకుతారు. కావున ఆ పేరు స్థానంలో సరిత అనే పేరు బాగుంటుందని ఆమెకు ఆ పేరు పెట్టడం జరిగింది. తర్వాత మద్రాసు నుంచి ట్రైన్ లో కె.బాలచందర్, కమల్ హాసన్, సరిత మరియు చిత్ర యూనిట్ విశాఖపట్నం బయల్దేరారు.
అయితే ఈ మరో చరిత్ర సినిమా కి హీరోయిన్ గా సరితను ఎందుకు బుక్ చేశారని ట్రైన్ లో కమల్ హాసన్ లో లోపల బాధపడే వాడట. కానీ సినిమాకి కొత్త అయిన సరిత.. నటన బాగుండడంతో సినిమా సగం పూర్తి అయిన తర్వాత ఆమెతో కమల్ హాసన్ స్నేహంగా ఉండటం మొదలుపెట్టాడు. అలా మరో చరిత్ర సినిమా 1978 మే 19న విడుదలైన తర్వాత సినిమా బాగుంది. కానీ హీరోయిన్ మామూలుగా ఉందని నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ లాంగ్ రన్ లో హీరోయిన్ నటన బాగుంది సినిమాకి ఆమె ప్లస్ అనడంతో మరో చరిత్ర సినిమా ఘన విజయాన్ని సాధించింది.



































