సినిమా రంగంలో ఓ హీరో, హీరోయిన్ కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫైర్ కొనసాగుతుందంటూ రూమర్స్ రావడం సర్వ సాధారణ విషయమే. అయితే ఒక హీరో, హీరోయిన్లు వరుసగా 2,3 సినిమాల్లో కలసి నటిస్తున్నారంటే.. ఇంక ఆ రూమర్స్ నిజమేనని అందరూ నమ్మేస్తుంటారు.
హీరో, హీరోయిన్ల మధ్య వున్న ప్రత్యక్షంగా వున్న చనువును కూడా సినిమాకు పబ్లిసిటీ వాడేసుకుంటూ వుంటారు. హీరో, హీరోయిన్లు కూడా అలాగే చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటారు. 

కానీ చిత్ర యూనిట్ లోని కొందరు తమ సినిమా పబ్లిసిటీ కోసమే ఇలాంటి గాసిప్స్ ను సోషల్ మీడియాలో రాయిస్తుంటారు అనే టాక్ కూడా వినిపిస్తుంటుంది. మారుతున్న ట్రెండ్ కనుగుణంగా ఇప్పుడు ఈ రూమర్స్ కేవలం సినిమా నటీనటులకే పరిమితం కాకుండా బుల్లితెర నటీనటుల వరకూ పాకిందని చెప్పవచ్చు. ‘జబర్దస్త్’, ‘బిగ్ బాస్’ వంటి షో లలో కూడా ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారని ఆ షోలు చూస్తున్న వాళ్ళెవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఈ సంస్కృతి బాలీవుడ్ లో అయితే ఎప్పటినుండో ఉంది. ఇక అసలు విషయానికి వస్తే.. ‘కవచం’, ‘సీత’ వంటి సినిమాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్నప్పుడు కూడా.. వీళ్లిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ షికార్లు చేశాయి. తీరా ఈ 2 సినిమాలు విడుదలైన తరువాత ఎవరి పని వాళ్ళు చూసుకోవడంతో అదంతా కేవలం పబ్లిసిటీ స్టంటేనని తేల్చేశారు నెటిజన్లు.

కానీ తాజాగా కాజల్.. ‘బెల్లంకొండ శ్రీనివాస్ ను మిస్ అవుతున్నట్టు’.. ఓ పాత ఫోటోని షేర్ చేయడంతో నెటిజన్లు షాకయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా రిప్లై ఇచ్చాడు. ‘నేను కూడా నిన్ను మిస్సవుతున్నానని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలవమంటే ఎలా?’ అంటూ రొమాంటిగ్గా స్పందించాడు. దీంతో వీళ్ళిద్దరూ మళ్ళీ వార్తల్లో వైరలవుతున్నారు. కాజల్.. సడెన్ గా బెల్లంకొండ శ్రీనివాస్‌ను మిస్సవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టును షేర్ చేయడం హాట్ టాపికైంది. వాస్తవానికి వీళ్లిద్దరూ ఏ ఉద్దేశంతో ఛాట్ చేసుకుంటున్నారో కానీ.. ఇద్దరూ ఇలాంటి పోస్టులు పెట్టేసరికి జనాలకు రకరకాల అనుమానాలు మొదలవుతున్నాయి. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా.? అన్నదే ప్రేక్షకుల సందేహం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here