అతడు సినిమా తెలుసు కదా. అప్పట్లో అదో సంచలనం. అప్పట్లో ఎవరి నోట చూసినా అతడు సినిమా గురించే చర్చ. మామూలు సినిమా కాదది. ఆ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఒకరకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అది.

ఆ సినిమాతో మహేశ్ బాబు రేంజ్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది త్రివిక్రమ్. అప్పటికే ఆయన పలు సినిమాలకు కథ, మాటలను అందించారు. నువ్వే నువ్వే సినిమాకు మాత్రం దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే మహేశ్ బాబుతో సినిమాను ప్లాన్ చేశారు.
అతడు సినిమాను నిర్మించింది మురళీ మోహనే

అతడు సినిమాను నటుడు, నిర్మాత మురళీ మోహన్ నిర్మించారు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన జయభేరి ఆర్ట్స్ మీద ఆ సినిమాను నిర్మించారు. అయితే.. ఆ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ వేరట.. తర్వాత అయిన బడ్జెట్ వేరట. నిజానికి.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. హీరోకు, దర్శకుడికి, విలన్ కు, హీరోయిన్ కు.. అందరికీ పేరు వచ్చింది. అయితే ఆ సినిమాను నిర్మించిన నిర్మాతకు మాత్రం లాభాలు రాలేదు. అదే ఇక్కడ ట్విస్ట్.
ఓవర్ బడ్జెటే కారణమా?

ఆ సినిమాకు ఓవర్ బడ్జెట్ పెట్టడమే సినిమాకు నష్టాలను తెచ్చిపెట్టిందట. నిజానికి.. ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందట. బడ్జెట్ ఎక్కువైనా కూడా మురళీ మోహన్.. తప్పని పరిస్థితుల్లో ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తీయాల్సి వచ్చిందట. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. నిర్మాతకు లాభాలు రాలేదు. దాని వల్ల.. అతడు సినిమా తర్వాత చేయాలనుకున్న సినిమాలు ఆగిపోయాయట. ఆ నిర్మాణ సంస్థలో కొన్ని రోజుల పాటు సినిమాలు చేయలేకపోయారట.
మళ్లీ జయభేరి సంస్థ ద్వారా సినిమాలు

మురళీ మోహన్ జయభేరి సంస్థ ద్వారా ఎప్పుడు బడ్జెట్ సినిమాలను మాత్రమే తీసేవారు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఎక్కువగా మురళీ మోహన్.. బడ్జెట్ సినిమాలను తీసేవారు. కానీ.. ఓవర్ బడ్జెట్ అయింది మాత్రం ఒక్క అతడు సినిమాకే. ఆ తర్వాత జయభేరి సంస్థ ద్వారా రావాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయట. కానీ.. మళ్లీ జయభేరి సంస్థ ద్వారా సినిమాలు తీసేందుకు మురళీ మోహన్ సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక.. కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

అయితే.. సూపర్ హిట్ అయిన సినిమాలు అన్నీ నిర్మాతకు కాసులు కురిపించవు అని ఈ ఘటన ద్వారా అందరికీ అర్థం అయింది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అయిందంటే.. దానికి కారణం మాత్ర దర్శకుడే అని చెప్పాలి. అతడు సినిమా విషయంలో అది ముమ్మాటికీ డైరెక్టర్ త్రివిక్రమ్ వైఫల్యం అనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా.. మురళీ మోహన్.. ఆనాడు ధైర్యం చేసి అతడు సినిమాను నిర్మించి ఉండకపోయి ఉంటే.. ఈనాడు మనం ఆ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పుకునేవాళ్లం కాదు.



























