నవ్విన నాపచేనే నవరత్నాలను పండించినట్టు కొన్ని సందర్భాల్లో మనం ఊహించని వ్యక్తులు అత్యున్నత స్థానానికి వెళ్లడం చూస్తూ ఉంటాం. మన చుట్టూ సాధారణ వ్యక్తులు గా తిరుగుతున్న వారు సడెన్ గా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్లు ఓ గొప్ప హోదాలో ఉండటం చూసి మనం షాక్ అవుతుంటాం. అది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరు ఏ సందర్భంలో ఎటువంటి హోదాలో ఉంటారో ఎవరు కూడా ఊహించలేరు.

“అందాలొలికే సుందరి నీవే కలలో కొచ్చేను.. పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసేదోచేను.. అంటూ కుర్రకారు మనసు దోచిన ఆనాటి హీరోయిన్ నలిని తమిళనాడులో పుట్టి పెరిగి చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి తమిళంలో “వుయిరువుల్లవరై ఉష” అనే సినిమాలో నటించింది. టి.రాజేందర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాని ప్రేమ సాగరం పేరుతో తెలుగులోకి అనువదించడం జరిగింది. ప్రేమ సాగరం దాదాపు తెలుగులో 365 రోజులు ఆడింది. నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి కి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజ్ కి.. అనే పాట కాలేజీ కుర్రాళ్ళ గుండెల్ని ఓ కుదుపు కుదిపేసింది.

ప్రేమ సాగరం హీరోయిన్ నలిని తను 8వ తరగతి చదువుతున్న సమయంలోనే తనకు హీరోయిన్ గా సినిమాల్లో అవకాశం వచ్చింది. అంతకుముందు నలిని రైటింగ్ బాగోలేదని ఆమె స్కూల్లో ఒక టీచర్ చేతిపై కొట్టేది.. 1983 లో ప్రేమ సాగరం సినిమా విడుదలై తమిళ,తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించిన తర్వాత తను చదివిన స్కూల్ కి నలిని వెళ్ళినప్పుడు ఆమే చేతి పై కర్రతో కొట్టిన టీచర్ ఆటోగ్రాఫ్ కావాలని ముందువరుసలో నిల్చోవడం నళినికి ఆశ్చర్యమేసింది.

ప్రేమ సాగరం లాంటి సినిమాలో నటించిన నళినికి తన ప్రేమ పెళ్లి కూడా దాదాపు ఒక సినిమాను తలపించేలా జరిగింది. నలిని ప్రేమ వివాహము ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రామరాజన్ అనే తమిళ నటుడు ఆమెను లేపుకెళ్లి పెళ్లి చేసుకుందాం అనే సమయంలో ఆమె అన్నయ్యలు రామరాజన్ కారును వెంబడించడం జరిగింది.అలా వారి నుంచి తప్పించుకొని ఎట్టకేలకు చిట్టచివరికి వారి పెళ్లి జరిగింది.



























