ఈ దర్శకుడితో సినిమా చేయాలని ప్రతి ఒక్క నటీనటులు అనుకుంటారు. కానీ కొంతమందికే అవకాశం వస్తుంది. అలాంటి అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారే భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సృజనాత్మక, యదార్థగాథలతో సహజమైన చిత్రీకరణతో ఆ దర్శకుడి సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు సగటు మనిషి నిజ జీవితానికి అద్దం పడతాయి.

1992లో దర్శకుడు మణిరత్నం రోజా చిత్రంతో తెలుగు సినిమాలకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో అరవింద్ స్వామి, మధుబాల హీరో హీరోయిన్స్ గా నటించారు. రోజా సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 1993లో దొంగ దొంగ సినిమా తీస్తున్న సమయంలో ముంబై అల్లర్లు జరగడం మణిరత్నం ను కదిలించడం జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో.. ఒక వర్గం ప్రజలు మరో వర్గం మీద దాడి చేయడంతో ముంబైలో విపరీతమైన ఘర్షణలు చెలరేగాయి.

ఇలా జరిగిన సంఘటన నుంచి మణిరత్నం ఒక కథ తయారు చేసుకోవడం జరిగింది. అలా ముంబై సినిమా కోసం మొదటగా హీరో విక్రమ్ ను కలవడం జరిగింది. అప్పటికి తాను గడ్డం మీసాలతో ఉండడం చూసిన మన మణిరత్నం అవి తీయించుకొని సినిమాలో నటించాలని కోరగా.. విక్రమ్ దానికి ఒప్పుకోలేదు. అలా ఆ ఆఫర్ రోజా సినిమాలో హీరోగా నటించిన అరవింద్ స్వామికి వెళ్ళింది.

1995 మార్చి 10న విడుదలైన బొంబాయి సినిమా దేశంలోనే పెద్ద ఎత్తున నిరసనలకు కారణమయ్యింది. హైదరాబాదులో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లను మూసివేయడం జరిగింది. బొంబాయి సినిమా అన్ని నిభాషల్లోను విడుదలై ఘన విజయాన్ని సాధించింది



























