వెంకటేష్ హీరోగా రుద్రవీణ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా.?!

0
1080

శారద, ఆమె కథ, ప్రాణం ఖరీదు, పునాదిరాళ్లు, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, శివుడు శివుడు లాంటి చిత్రాలకు నిర్మాతగానూ స్వాతి వంటి చిత్రాలకు రచయితగా ఆ తర్వాత అగ్నిగుండం, గౌతమి, నేటి సిద్ధార్థ, రాజేశ్వరి కల్యాణం, సీతారామయ్యగారి మనవరాలు, 9 నెలలు వంటి చిత్రాలకు దర్శకుడిగానూ క్రాంతి కుమార్ పని చేయడం జరిగింది.

తమిళంలో “ఉన్నాల్ మొడియం తంబి” చిత్రంలో కమల్ హాసన్ హీరోగా సీత హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని ఆధారం చేసుకుని 1988 ప్రాంతంలో అంజనా ప్రొడక్షన్స్, కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి, శోభన హీరో హీరోయిన్లుగా రుద్రవీణ సినిమా విడుదలయింది.

రుద్రవీణ చిత్రానికి ఆర్థికంగా డబ్బులు ఏమి రానప్పటికీ సినిమాకి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకువచ్చింది. అయితే సినిమా నిర్మాణ క్రమంలో ఉన్నప్పుడే…. యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ అధినేత మురారి బాలకృష్ణతో సీతారామ కళ్యాణం తీస్తున్న క్రమంలో క్రాంతి కుమార్ తీసిన స్వాతి సినిమా చూశారు. ఆ సినిమా మురారి కి చాలా నచ్చింది. వెంటనే నిర్మాత మురారి తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకి దర్శకత్వం వహించాలిసిందిగా క్రాంతి కుమార్ ని అడగడం జరిగింది. అప్పుడే వెంకటేష్ తన మొదటి చిత్రాన్ని కలియుగ పాండవులు పూర్తి చేసి ఉన్నారు.

వెంకటేష్ హీరోగా నిర్మాత మురారి చేయబోయే సినిమాలో నటించాల్సిందిగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్ డి.రామానాయుడుకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిర్మాత మురారి ఒక ఇంగ్లీష్ నవల చదివి ఇంప్రెస్ కావడం జరిగింది. ఆ కథనే సినిమాగా తీయాలని రుద్రవీణ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నారు. ఇదివరకే చిరంజీవి హీరోగా రుద్రవీణ షూటింగ్ జరుపుకుంటుందని కె.ఎస్.రామారావు గారు వెళ్లి నిర్మాత మురారి కి చెప్పడంతో అప్పుడు మురారి రుద్రవీణ అనే టైటిల్ ని అంజన ప్రొడక్షన్స్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా అనుకున్నా రుద్రవీణ చిత్రం దర్శకుడు క్రాంతి కుమార్ నిర్మాత మురారికి మధ్య సినిమా విషయంలో విభేదాలు రావడంతో సినిమాని మధ్యలోనే నిలిపివేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here