ఎవరు చేయలేని పాత్ర చేసిన ఈ హీరోయిన్ కు ఆ తరువాత అవకాశాలు ఎందుకు రాలేదో తెలుసా?

0
847

సౌత్ ఇండియన్ భాషలన్నింటిలో నటించి తనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్న అర్చన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతీ రాజా నుండి ప్రకాష్ రాజు, బాలు మహేంద్ర వంటి వాళ్లు కూడా ఆమె నటనను చూసి అబ్బుర పడ్డారంటే అతిశయోక్తి కాదు. చామనఛాయ రంగులో ఉన్నా… తన నటనా చాతుర్యంతో ప్రతి ఒక్కరిని వెండితెరకి కట్టిపడేసారు అర్చన. ఆమె అద్భుతమైన నటనకు గాను రెండు జాతీయ అవార్డులు, లెక్కలేనన్ని రాష్ట్ర పురస్కారాలు కూడా లభించాయి. తన కళ్ళతో, మొహంతోనే నవరసాలను పండించగల ఏకైక నటీమణి అర్చన.

అర్చన 1987వ సంవత్సరంలో వచ్చిన వీడు సినిమాతో 1988వ సంవత్సరంలో వచ్చిన దాసీ సినిమాతో రెండు జాతీయ ఉత్తమ నటీమణిగా అవార్డులను అందుకున్నారు. నిరీక్షణ సినిమా లో అర్చన ఒక గిరిజన తండాకు చెందిన యువతిగా జాకెట్ ధరించకుండా చీర కొంగు కప్పుకున్న పాత్రలో అత్యద్భుతంగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. దాసీ సినిమాలో ఆమె చూపించిన నటనా చాతుర్యము గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆమె తెలుగులో మధుర గీతం, రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన లేడీస్ టైలర్ లో టీచర్ గా, సుమన్ తో ఉక్కు సంకెల్లు, యోగి వేమన, మట్టి మనుషులు, భారత్ బంద్, చక్రయూహం, పచ్చ తోరనం, పోలీస్ వెంకటస్వామి చిత్రాల్లో నటించి ఎంతగానో అలరించారు.

బాలకృష్ణ నటించిన పాండురంగడు చిత్రంలో కూడా నటించి మెప్పించారు. ఈమెను పెద్ద వంశీతో పాటు రేవతి వంటివారు కూడా అనితరసాధ్యమైన నటీమణిగా ఒప్పుకుంటారు. హిందీలో 2002 సంవత్సరంలో విడుదలైన నిషాద్ సినిమాలో కూడా ఈమె నటించిన మెప్పించారు. ఈమె ఎక్కువగా ఆఫ్-బీట్ చిత్రాల్లో నటిస్తున్నారని.. కమర్షియల్ సినిమాలలో ఎంపిక చేసుకునేందుకు దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపలేదు.