టాలీవుడ్ టాప్ హీరోయిన్ సిమ్రాన్ భర్త ఎవరో తెలుసా.?

0
373

1990లో టాలీవుడ్ లోని అగ్ర హీరోలతో పాటు చాలా మంది యంగ్ హీరోలతో కలిసి నటించడమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఒక్క ఊపు ఊపిన అందాల తార రిషిబాల. అప్పట్లో రిషిబాల నావల్ సినిమా విడుదలవుతుందంటే చాలు.. సినిమా థియేటర్లలో టికెట్ల జాతర పండుగే. ఆ విధంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రిషిబాల నావల్ అంటే ఎవరనుకుంటున్నారా.? ఆమె మరెవరో కాదు.. మనందరికీ తెలిసిన సిమ్రాన్.

ఆమె నటన కోసం ఇప్పటికీ ఆమె ఫ్యాన్స్ కళ్లు కాయలు ఎదురు చూస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఉర్దూ భాషల చిత్రాల్లో ఆమె నటించింది. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా సందడి చేసింది సిమ్రాన్. మల్టీ టాలెంటెడ్ నటి అయిన ఈ ముద్దుగుమ్మను పెళ్ళాడిన భర్త ఎవరో మీకు తెలుసా.? ఖచ్ఛితంగా తెలియదనే సమాధానం వస్తుంది కదూ.. అయితే టాలీవుడ్ నటి సిమ్రాన్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సిమ్రాన్ అసలు పేరు రిషిబాల నావల్. ఈమె 1976లో ఏప్రిల్ 4వ తేదీన అశోక్ నావల్, శారదా నవల్ దంపతులకు జన్మించింది. అయితే ఈమెది పంజాబీ. ఈమెకు ఇద్దరు సోదరీమణులు మోనాల్, జ్యోతి నావల్ తో పాటు ఓ సోదరుడు సుమిత్ కూడా ఉన్నారు. సెయింట్ ఆంథోనీ హైస్కూల్ లో చదివిన సిమ్రాన్ ముంబైలో డిగ్రీలో బీకామ్ పూర్తి చేసింది. తన మాతృభాష పంజాబీతో పాటు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి పట్టును సాధించింది. వ్యక్తిగతంగా సిమ్రాన్ కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. భరత నాట్యంలోనూ, లేటెస్ట్ డాన్స్ సల్సాలో శిక్షణ పొందింది. తన సినిమా కెరీర్ ఓ మాంచి రేంజ్ లో ఉన్న టైంలోనే 2003లో తన చిన్ననాటి స్నేహితుడైన దీపక్ బగ్గాని పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత వెండి తెరకు కొంత విరామం ప్రకటించింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఆదిత్, అదీప్.

సిమ్రాన్ కు డ్యాన్స్ తో పాటు మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈమె కాలేజీలో చదువుకునే టైంలోనే ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఎన్నో కలల్ని కన్నది. వాటిని నిజం చేసుకుంటూ సినీ తారగా తళుక్కున మెరిసింది. 1995లో బాలీవుడ్ లోకి తన మొదటి చిత్రం “సనమ్ హార్‌జాయె” ద్వారా అడుగు పెట్టింది సిమ్రాన్. అయితే తన తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై సూపర్ హిట్ ‘ముఖబ్లా’ షోకి యాంకర్ గా వ్యవహరించింది. ఆ తరువాత “తేరే మేరె సప్నె” బాలీవుడ్ చిత్రం ద్వారా పరిచయమైంది. అలాగే దక్షిణాదిలో ‘ఇంద్రప్రస్థం‘ అనే సినిమా ద్వారా పరిచయమైంది. అలా వరుసగా సినిమాలలో నటిస్తూ.. ‘అబ్బాయి గారి పెళ్లి‘ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సిమ్రాన్ వెనుదిరిగి చూసుకోలేదు. తమిళ చిత్ర పరిశ్రమలో “లేడీ సూపర్‌స్టార్” అని పేరు తెచ్చుకొంది. అలాగని టాలీవుడ్ ను వదులుకోవడానికి సిమ్రాన్ ఏ మాత్రం ఇష్టపడలేదు. తనకు తెలుగులో వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది.

టాలీవుడ్ లోని అగ్ర కథనాయకులందరితో నటించి అందరినీ మెప్పించింది. బాలక్రిష్ణతో ‘సమర సింహారెడ్డి‘ లో నటించిన ఈమెకు తెలుగులో ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చి పడింది. ఆ తర్వాత చిరంజీవితో అన్నయ్య, డాడీతో పాటు నాగార్జునతో ‘నువ్వు వస్తావని‘ ‘బావ నచ్చాడు‘ వెంకటేష్, మహేష్ బాబుతో పాటు ఇంకా ఎందరో యంగ్ హీరోలతో ప్రేమ కధా చిత్రాలలో నటించింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చక్కగా అర్థం చేసుకున్న సిమ్రాన్ తన సినిమా కెరీర్ ఓ రేంజ్ లో ఉన్నప్పుడే కొన్ని వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. ముఖ్యంగా కొన్ని కూల్ డ్రింక్స్ కు, సబ్బులకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించింది. ఆ తర్వాత సిమ్రాన్ తన నటనకు కొంత కాలం విరామం ఇచ్చి గత ఏడాది రజనీకాంత్ తో కలిసి వెండి తెరపై మరోసారి అడుగుపెట్టింది. ఇందులోనూ ఈమె నటకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటికీ ఆమె 40 ఏళ్ల వయసు ఉన్నా.. ఆమె అలా కనిపించకపోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here