తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఆషా శైని. మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్‌గా మారిన ఈమె రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి స్టార్ హీరోలతో తెరను పెంచుకుంది. ఇతర భాషల కంటే ఆషా సైని తెలుగులోనే ఎక్కువ చేసింది. ఆషా శైని చండీఘర్ లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో పుట్టింది. ఆమె అసలు పేరు ఫ్లోరా.

జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ లోనూ, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది. అయితే కొంత కాలానికి ఆషా సైని కుటుంబం కోల్ కతాకు మకాం మార్చారు. అక్కడే ఆమె మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగించింది. మిస్ కోల్ కతా అందాల పోటీల్లో పాల్గొనింది. అలా సౌత్ ప్రొడ్యూసర్స్ కంట్లో పడింది. 1999లో ప్రేమకోసం అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమా మంచి పేరు తీసుకు రావడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.

అయితే అసలు పేరు ఫ్లోరా అయితే, ఈ పేరు హాలీవుడ్ హీరోయిన్ పేరులా ఉందని ప్రేమకోసం సినిమా నిర్మాత దండే యుగంధర్ తన పేరును ఆషా సైనిగా మార్చాడు. ఇదే సమయంలో ఒక జ్యోతిష్కుడి సలహా మేరకు కొన్ని రోజులు మయూరి అని పేరు మార్చుకుంది. కానీ ఆ పేరు కలిసి రాకపోవడంతో ఆశా అనే పెట్టుకుంది. ఇలా పేరు మార్చుకున్న ఆషా సైని తెలుగులో 10 సినిమాలకు పైగా సహాయ పాత్రలు పోషించింది. సోలో హీరోయిన్‌గా మాత్రం స్టార్స్ పక్కన అవకాశాలు అందుకోలేకపోయింది.

ఆషా సైని నటించిన సినిమాలలో బాలకృష్ణ నరసింహ నాయుడు, వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, చాలా బాగుంది, మనసున్న మారాజు, సర్దుకుపోదాం రండి, ఓ చినదానా లాంటి సినిమాలు బాగానే పేరు తీసుకువచ్చాయి. కానీ రాశి, రంభ, సిమ్రన్, సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్స్‌తో పోటీ పడలేక స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఇక 2002లో ఆషా సైని టి.పి.అగర్వాల్ నిర్మించిన ‘భారత్ భాగ్య విధాత’ సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ‘లవ్ ఇన్ నేపాల్’ అనే హిందీ చిత్రంలో పాపులర్ సింగర్ సోనూనిగంతో కలిసి నటించింది. తర్వాత నమ్మణ్ణ, గిరి లాంటి కన్నడ సినిమాల్లో నటించింది.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషాలలో నటించిన ఆషా సైనికి ఏ ఇండస్ట్రీలోనూ సరైన ఎంకరేజ్‌మెంట్ లభించలేదు. పర్ఫార్మెన్స్ పరంగా బాగానే నటించి ఆకట్టుకుంది. గ్లామర్ రోల్స్‌కి కూడా వెనకాడకుండా సై అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా ఈమె ఆషా సైని ఆశించిన భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలను అందుకోలేకపోయింది. ఇప్పటికీ సినిమాలలో నటిస్తూనే ఉంది. కానీ తన కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి సినిమా అని చెప్పుకునేది ఒక్కటి లభించడం లేదు. ఇక ఈమె కెరీర్‌లో కరిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ పోలీసులు అరెస్ట్ చేయడం.

మార్చి 2008 లో ఆషా సైనిని చెన్నైలో నకిలీ వీసా కలిగి ఉన్నదనే నేరం మీద అరెస్టు చేశారు. ఇది ఆమెకి కోలుకోలేని దెబ్బ. ఒకసారి హీరోయిన్ మీద ఇలాంటి వార్తలు వస్తే మేకర్స్ అవకాశాలివ్వడానికి ధైర్యం చేయరు. నత్త నడకన సాగుతున్న ఆషా సైని కెరీర్‌కి ఇది పెద్ద మైనస్ గా మారింది. ఏవో చిన్న క్యారెక్టర్స్ చేస్తూ నెట్టుకొస్తుది. అది కూడా తనని తాను నిర్ధోషిని అని ప్రూవ్ చేసుకున్న తర్వాత. తెలుగులో ఆషా సైని నటించిన ఆఖరు సినిమా ఆ ఇంట్లో. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆమె కనుమరుగైపోయింది.



























